రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌లో మెరిసిన బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవల వచ్చిన దుల్కర్ సల్మాన్ కాంత మూవీలో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
ఆన్‌స్క్రీన్ హీరోగా ఉపేంద్ర

తాజాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఆన్‌స్క్రీన్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు.
భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ విషయాలు
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
ముందుగా కంగ్రాజులేషన్స్. కాంత సినిమాకి, మీ పర్ఫామెన్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎలా అనిపించింది?
-చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు నటిగా నాలో ఉన్న పొటెన్షియల్ చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే.
ఆంధ్ర కింగ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఆంధ్ర కింగ్‌లో నేను మహాలక్ష్మి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తను కాలేజ్ గోయింగ్ గర్ల్. సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. అంతకుమించి ఇప్పుడు ఎక్కువ క్యారెక్టర్ గురించి రివీల్ చేయకూడదు. కథలో తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ ఆడియన్స్ గుర్తుపెట్టుకునేలా ఉంటుంది.
మహేష్ గారు ఈ కథ చెప్తున్నప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి?
-అభిమానం అనేది డివైన్ ఎమోషన్. నేను నార్త్ నుంచి సౌత్‌కి వచ్చినప్పుడు ఇక్కడ అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్‌ని ఎంత గొప్పగా ఆరాధిస్తారో ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. అది నిజంగా చాలా గొప్ప ఎమోషన్.
{{/usCountry}}-అభిమానం అనేది డివైన్ ఎమోషన్. నేను నార్త్ నుంచి సౌత్‌కి వచ్చినప్పుడు ఇక్కడ అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్‌ని ఎంత గొప్పగా ఆరాధిస్తారో ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. అది నిజంగా చాలా గొప్ప ఎమోషన్.
{{/usCountry}}-ఎలాంటి రిలేషన్ లేకుండా పరిచయం లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారు అనిపించేది. మహేష్ బాబు ఈ కథ చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.
ఉపేంద్ర గారితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా?
-ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఆయన వెరీ హంబుల్ యాక్టర్. చాలా డౌన్ టు ఎర్త్. ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
సాగర్ మహాలక్ష్మి లవ్ స్టోరీ ఎంత కొత్తగా ఉండబోతుంది?
-ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉండబోతుంది. నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో పాటలు మీరు చూసే ఉంటారు. ప్రేమలో ఉన్న గొప్ప ఎమోషన్ ఇందులో ఉంటుంది.