Oscar Movie: 18 ఏళ్లుగా ఇండియన్ ఆస్కార్ అవార్డ్ మూవీకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో- ఎంతో తెలుసా?

Anil Kapoor Still Get Remuneration For Slumdog Millionaire: ఆస్కార్ గెలిచిన ఇండియన్ సినిమా 'స్లమ్‌డాగ్ మిలియనీర్' అనిల్ కపూర్‌ను నిజంగానే మిలియనీర్‌ను చేస్తోందని తెలిపారు. 18 ఏళ్లుగా ఆ సినిమా నుంచి తనకు ఇంకా డబ్బులు వస్తూనే ఉన్నాయని అనిల్ కపూర్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు మీకోసం.

Published on: Mar 15, 2026, 16:51:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ హీరో అనిల్ కపూర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2008లో విడుదలై సంచలనం సృష్టించిన ఆస్కార్ విజేత 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా అనిల్ కపూర్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాదు, ఇప్పటికీ ఆయన బ్యాంక్ అకౌంట్‌ను నింపుతూనే ఉంది.

18 ఏళ్లుగా ఇండియన్ ఆస్కార్ అవార్డ్ మూవీకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో- ఎంతో తెలుసా?
18 ఏళ్లుగా ఇండియన్ ఆస్కార్ అవార్డ్ మూవీకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో- ఎంతో తెలుసా?

నేటికీ అందుతున్న పే చెక్కులు!

ఇటీవల జరిగిన 'ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026'లో పాల్గొన్న అనిల్ కపూర్ ఒక ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. "ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా (స్లమ్‌డాగ్ మిలియనీర్) విడుదలై పదిహేనేళ్లకు పైగా (18 సంవత్సరాలు) అవుతోంది. అయినా సరే, నిన్ననే నాకు స్లమ్‌డాగ్ మిలియనీర్ టీమ్ నుంచి మరో పే చెక్కు వచ్చింది" అని అనిల్ కపూర్ వెల్లడించారు.

ఆ అమౌంట్ ఎంత అని అడగ్గా.. "నిన్న నాకు 3,000 పౌండ్లు (దాదాపు 3.2 లక్షల రూపాయలు) వచ్చాయి. పన్నులన్నీ చెల్లించి గర్వంగా చెబుతున్నాను.. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకు మొత్తం కలిపి దాదాపు ఐదు లక్షల పౌండ్లు (సుమారు 5.3 కోట్ల రూపాయలు) అందబోతున్నాయి. అందుకే నేను నిజమైన మిలియనీర్‌ని అయ్యాను. ఈ డబ్బు నేను అడగలేదు, వాళ్లే స్వయంగా ఇస్తున్నారు" అని అనిల్ కపూర్ వివరించారు.

నేర్చుకోవాలన్న తపనతోనే ఆ సినిమా..

నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు చిత్ర యూనిట్ అనిల్ కపూర్‌కు అంత రెమ్యూనరేషన్ ఇచ్చే స్థితిలో లేరట. "నన్ను అడిగినప్పుడు నా ఫీజు ఇవ్వలేమని వాళ్లు చెప్పారు. దాంతో నేను ఉచితంగా చేస్తానని ఆఫర్ ఇచ్చాను. ఎందుకంటే ఆ సినిమాను నేను డబ్బు కోసం కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం చేశాను. అలా అప్‌డేటెడ్‌గా ఉండటమే నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టింది" అని 69 ఏళ్ల ఈ స్టార్ హీరో చెప్పుకొచ్చారు.

వికాస్ స్వరూప్ రాసిన 'క్యూ అండ్ ఏ' పుస్తకం ఆధారంగా తెరకెక్కిన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో అనిల్ కపూర్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' హోస్ట్‌గా నటించారు. 2008లో విడుదలైన ఈ ఇండియన్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్ 2009లో ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అయితే, అమెజాన్ ప్రైమ్‌లో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే, యానిమల్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో సుబేదార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధంతో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అయింది.

స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో

ప్రస్తుతం అలియా భట్, శార్వరీ వాఘ్‌లతో కలిసి 'ఆల్ఫా' అనే స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో అనిల్ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More