Anil Ravipudi: విజయ్ జన నాయగన్ స్టోరీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి.. భగవంత్ కేసరి హక్కులు తీసుకున్నారు కానీ..

Anil Ravipudi: విజయ్ జన నాయగన్ మూవీ భగవంత్ కేసరి రీమేక్ అని వస్తున్న వార్తలపై డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ హక్కులు వాళ్లు తీసుకున్న మాట నిజమే కానీ.. కొన్ని సీక్వెన్స్ మాత్రమే వాడుకున్నారని, దాని చుట్టూ వేరే స్టోరీ క్రియేట్ చేసినట్లు చెప్పాడు.

Published on: Jul 22, 2026, 15:29:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anil Ravipudi: తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జన నాయగన్' (Jana Nayagan) స్టోరీలైన్‌పై టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ క్లారిటీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ హక్కులను జన నాయగన్ టీమ్ అధికారికంగా సొంతం చేసుకున్న మాట నిజమేనని ఆయన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Anil Ravipudi: విజయ్ జన నాయగన్ స్టోరీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి.. భగవంత్ కేసరి హక్కులు తీసుకున్నారు కానీ..
Anil Ravipudi: విజయ్ జన నాయగన్ స్టోరీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి.. భగవంత్ కేసరి హక్కులు తీసుకున్నారు కానీ..

హక్కులు కొన్నారు.. కానీ కొత్త కథే!

ఈ రీమేక్ ప్రాసెస్ గురించి మాట్లాడిన అనిల్ రావిపూడి.. తమిళ మేకర్స్ భగవంత్ కేసరి నుంచి కేవలం కొన్ని కీలకమైన సీన్లు, ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నారని చెప్పారు. ఆ సీక్వెన్సెస్ చుట్టూ పూర్తిగా ఒక డిఫరెంట్, కొత్త స్టోరీని తయారు చేసుకున్నారని ఆయన వివరించారు.

ఈ సినిమాలో తనకు ఎలాంటి పాత్ర లేదని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాత డైరెక్టర్ హెచ్. వినోద్ అండ్ టీమ్ తమ సొంత ఐడియాతోనే ఈ స్క్రిప్ట్ పూర్తిగా రెడీ చేసుకున్నారని చెప్పారు.

అలా విజయ్‌ని కలిశాను

ఇక విజయ్ ను తాను ఎలా కలిశాను.. భగవంత్ కేసరి గురించి ఆయన ఏం చెప్పారన్న విషయాలపైనా అనిల్ స్పందించారు. ది గోట్ మూవీ షూటింగ్ సందర్భంగా హైదరాబాద్ లో విజయ్ ఉన్నప్పుడు తనను రమ్మన్నారని అనిల్ చెప్పారు.

దీంతో వెంటనే తాను పరుగెత్తుకుంటూ వెళ్తే.. భగవంత్ కేసరి చూశానని, చాలా బాగా నచ్చిందని విజయ్ అన్నారని అనిల్ వెల్లడించారు. ఆయన ప్రశంసలతో ముంచెత్తేసరికి తాను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని కూడా చెప్పారు. ఆ తర్వాతే మూవీ రీమేక్ హక్కులు వాళ్లు తీసుకున్నట్లు తెలిపారు.

భగవంత్ కేసరి మ్యాజిక్ అండ్ విజన్

నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' బాక్సాఫీస్ దగ్గర రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అమ్మాయిల రక్షణ, 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' లాంటి ఎమోషనల్ పాయింట్‌కు మాస్ యాక్షన్ జోడించి అనిల్ రావిపూడి డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఇదే పవర్‌ఫుల్ బాండింగ్ అండ్ ఎమోషన్ దళపతి విజయ్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని తమిళ మేకర్స్ భావించారు. అందుకే ఈ సినిమా అధికారిక హక్కులను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి తమ నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసుకున్నారు.

దళపతి విజయ్ లాస్ట్ మూవీ.. అంచనాలు పీక్స్!

ప్రస్తుతం హెచ్. వినోద్ డైరెక్షన్‌లో వస్తున్న 'జన నాయగన్' సినిమా విజయ్ కెరీర్‌లో 69వ ప్రాజెక్ట్ కావడమే కాకుండా, ఆయన చివరి చిత్రం కావడంతో విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో బాబీ డియోల్ పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

అనిల్ రావిపూడి సక్సెస్ గ్రాఫ్

మరోవైపు వరుస హిట్లతో టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, తన ప్రతి సినిమాలోనూ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ మాస్ ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తారు. పటాస్ నుంచి మన శంకర వర ప్రసాద్ గారు మూవీ వరకు బాక్సాఫీస్ దగ్గర సూపర్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఇతర ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వెంకటేశ్, కల్యాణ్ రామ్ లతో కలిసి మూవీ చేస్తుండగా.. ఇవి వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More