Charu Shankar: నేను అద్భుతమైన విలన్ కాగలను, రూల్స్ పాటించే మనిషిని కాదు- యానిమల్‌లో తల్లిగా నటించిన చారు శంకర్ కామెంట్స్
Charu Shankar About Dream Role Villain: సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తల్లిగా నటించి మెప్పించిన చారు శంకర్.. తాజాగా అనన్య పాండే 'చాంద్ మేరా దిల్' సినిమాలో సింగిల్ మదర్‌గా అలరించారు. బాలీవుడ్‌లో ఇప్పుడు గ్లామరస్, పవర్‌ఫుల్ మదర్స్ ట్రెండ్ నడుస్తోందని చారు శంకర్ పేర్కొన్నారు.
Charu Shankar About Dream Role Villain: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' (2023) సినిమాలో రణ్‌బీర్ కపూర్‌కు తల్లిగా (జ్యోతి పాత్రలో) నటించిన చారు శంకర్ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఆమెకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి.

సింగిల్ మదర్‌గా
తాజాగా వివేక్ సోని దర్శకత్వంలో విడుదలైన 'చాంద్ మేరా దిల్' చిత్రంలో అనన్య పాండేకు సింగిల్ మదర్‌గా (నివేదిత పాత్రలో) చారు శంకర్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో నటీమణులకు ఎదురవుతున్న టైప్‌కాస్టింగ్ (ఒకే రకమైన పాత్రలకే పరిమితం చేయడం), సినిమాల ఎంపిక, భవిష్యత్తులో తాను చేయాలనుకునే డ్రీమ్ రోల్స్ గురించి హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చారు శంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'చాంద్ మేరా దిల్' కథ నచ్చడానికి కారణం అదే!
అనన్య పాండే, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటించిన 'చాంద్ మేరా దిల్' సినిమాలో నటించడంపై చారు శంకర్ స్పందించారు. "ఈ సినిమాలో అద్భుతమైన ప్రేమకథతో పాటు పాత్రల ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం ఒక గుడ్డి ప్రేమగా కాకుండా, వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే పరిణతి చెందిన ప్రేమకథ ఇది. ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో తీసుకునే నిర్ణయాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, ఒకరినొకరు గాయపరుచుకుంటూనే మళ్లీ ఎలా దగ్గరయ్యారనేది ఇందులో చక్కగా చూపించారు" అని చారు శంకర్ వివరించారు.
ఈ సినిమాలో హీరో లక్ష్యతో రెస్టారెంట్‌లో వచ్చే ఒక ఘర్షణ సీన్ (కన్‌ఫ్రంటేషన్) తనకెంతో నచ్చిందని చారు శంకర్ చెప్పారు. కూతురిపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ఒక తల్లిగా ఆ సీన్‌లో కనిపించే ఆవేశం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త ఎనర్జీని ఇస్తుందని, సినిమా అంతటా తన కూతురికి అండగా నిలిచే ఒక బలమైన పాత్ర ఇదని చారు పేర్కొన్నారు.
తెరపై 'గ్లామరస్, పవర్‌ఫుల్ మదర్స్' ట్రెండ్
సినిమా పరిశ్రమలో నటీమణులను ఒకే తరహా పాత్రలకే పరిమితం చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతాయని చారు శంకర్ అభిప్రాయపడ్డారు. "చిత్ర పరిశ్రమ మహిళలను కొన్ని నిర్దేశిత పాత్రల్లోనే ఉంచాలని చూస్తుంది. కానీ, నేను రూల్స్ పాటించే మనిషిని కాదు" అని చారు శంకర్ తెలిపారు.
"ప్రస్తుతం వెండితెరపై తల్లుల పాత్రలు మారడం నాకు సంతోషాన్ని ఇస్తోంది. ఇప్పుడు సినిమాల్లో తల్లులు కేవలం పిల్లల కోసమే బతికేలా కాకుండా ప్రతిష్టాత్మకంగా, గ్లామరస్‌గా, పవర్‌ఫుల్‌గా, అన్ని ఎమోషన్స్ ఉన్న సాధారణ మనుషుల్లా కనిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే, ఇది ఒక రకంగా ఎగ్జోటిక్ మదర్స్ (Exotic Moms) ట్రెండ్ నడుస్తున్న కాలం" అని చారు శంకర్ విశ్లేషించారు.
ఓటీటీ సిరీస్‌లో
'యానిమల్' లో జ్యోతి, 'చాంద్ మేరా దిల్' లో నివేదిత, అంతకుముందు 'రాకెట్ బాయ్స్' ఓటీటీ వెబ్ సిరీస్‌లో ఇందిరా గాంధీ పాత్ర.. ఇలా తాను చేసిన పాత్రలన్నీ ఎమోషనల్ పవర్‌తో కూడుకున్నవేనని, ఎవరి కథలోనూ అవి కేవలం బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం కాలేదని చారు శంకర్ గుర్తుచేశారు.
చారు శంకర్ సినిమాలు
చారు శంకర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన 'ఎహసాస్', 'లిల్ ఫిషీస్', 'పుకమ్ పుకాయ్' వంటి చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ తెరకెక్కిస్తున్న 'అమ్రి' చిత్రంలోనూ చారు శంకర్ నటిస్తున్నారు. అలాగే ఒక ఒపేరా సింగర్ జీవితం ఆధారంగా వస్తున్న షార్ట్ ఫిలింలోనూ నటిస్తున్నట్లు చెప్పారు.
విలన్‌గా చేయడమే నా కల!
తన డ్రీమ్ రోల్ గురించి చెబుతూ.. "నాకు స్పై థ్రిల్లర్స్, సైకలాజికల్ క్రైమ్ షోలు అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్ర చేయాలని ఉంది. నేను అద్భుతమైన విలన్ కాగలను. కానీ, నన్ను చూస్తే ఎవరూ విలన్ అని అస్సలు ఊహించలేరు. అందుకే నెగెటివ్ రోల్స్ చేయాలనుంది. దాంతో పాటు హారర్, యాక్షన్ సినిమాల్లో నటించడం నా డ్రీమ్" అని చారు శంకర్ మనసులోని మాటను బయటపెట్టారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. చారు శంకర్ 'యానిమల్' సినిమాలో ఏ పాత్ర పోషించారు?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'యానిమల్' లో చారు శంకర్.. నటుడు రణబీర్ కపూర్ తల్లి (జ్యోతి) పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
2. 'చాంద్ మేరా దిల్' సినిమాలో చారు శంకర్ పాత్ర ఏమిటి?
ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అనన్యా పాండేకు సింగిల్ మదర్ (నివేదిత) పాత్రలో కనిపించారు. కూతురికి అండగా నిలిచే ఒక స్వతంత్రమైన, బలమైన తల్లిగా ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
3. సినిమా ఇండస్ట్రీలో తల్లుల పాత్రలపై చారు శంకర్ అభిప్రాయం ఏమిటి?
ప్రస్తుతం వెండితెరపై తల్లుల పాత్రల శైలి మారుతోందని ఆమె అన్నారు. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం కాకుండా గ్లామరస్‌గా, పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్ కాంప్లెక్సిటీ ఉన్న పాత్రలు వస్తున్నాయని, దీనిని ఆమె 'ఎగ్జోటిక్ మదర్స్' ట్రెండ్‌గా అభివర్ణించారు.
4. చారు శంకర్‌కు భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
తనకు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో పవర్‌ఫుల్ విలన్ పాత్రలతో పాటు హారర్, యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఉందని చారు శంకర్ వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


