Anirudh Ravichander Kavya Maran Unseen Photos Of Wedding: సౌత్ ఇండియా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్ వేదికగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం కన్నులపండువగా జరిగింది.
అరుదైన ఫొటోలు షేర్ చేసిన అనిరుధ్

అయితే, ఈ పెళ్లి వేడుక ముగిసినప్పటి నుంచి అక్కడి అరుదైన మధుర క్షణాలను అనిరుధ్ రవిచందర్ తన అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా శుక్రవారం (నవంబర్ 20) నాడు మరికొన్ని ప్రత్యేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు.
కావ్య మారన్, అనిరుధ్ క్రేజ్
తెలుగు ప్రేక్షకుల్లో కావ్య మారన్, అనిరుధ్ ఇద్దరికి మంచి ఫేమ్ ఉంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సీఈవోగా కావ్య మారన్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. మరోవైపు 'జెర్సీ', 'దేవర', విక్రమ్, జైలర్, జైలర్ 2 వంటి సూపర్ హిట్ చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందించిన అనిరుధ్‌కు టాలీవుడ్లో భారీ అభిమాన గణం ఉంది.
స్పెషల్ సూట్స్‌లో
అనిరుధ్, కావ్య పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో హైదరాబాద్, చెన్నై సహా దక్షిణాది అంతటా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. అనిరుధ్ తాజాగా షేర్ చేసిన ఫోటోలలో మొదటి చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎరుపు రంగు జంప్‌సూట్‌లో కావ్య మారన్ మెరిసిపోతుండగా, నలుపు రంగు దుస్తుల్లో అనిరుధ్ స్టైలిష్‌గా కనిపించారు.
కావ్యను కన్నార్పకుండా చూసిన అనిరుధ్..
ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నడుస్తుండగా, అనిరుధ్ తన భార్య కావ్య వైపు కన్నార్పకుండా ప్రేమగా చూస్తున్న దృశ్యం నెటిజన్లను కట్టిపడేస్తోంది. మరో ఫోటోలో నవదంపతులు ఎంకే స్టాలిన్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చారు.
ఒకే తరహా లుక్‌లో రజనీ, అనిరుధ్
{{/usCountry}}ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని నడుస్తుండగా, అనిరుధ్ తన భార్య కావ్య వైపు కన్నార్పకుండా ప్రేమగా చూస్తున్న దృశ్యం నెటిజన్లను కట్టిపడేస్తోంది. మరో ఫోటోలో నవదంపతులు ఎంకే స్టాలిన్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చారు.
ఒకే తరహా లుక్‌లో రజనీ, అనిరుధ్
{{/usCountry}}సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ దిగిన ఫోటో అభిమానులకు కనువిందు చేస్తోంది. రజనీకాంత్ స్వయానా అనిరుధ్‌కు మేనమామ వరస అవుతారు. ఈ వేడుకలో రజనీకాంత్, అనిరుధ్ ఇద్దరూ తెలుపు రంగు షర్ట్, ప్యాంటు ధరించి ఒకే తరహా లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మామగారితో సరదాగా.. సముద్ర తీరాన రొమాంటిక్ పోజ్
పెళ్లి వేడుకల్లో కుటుంబ అనుబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ఈ ఫోటోలు చాటిచెబుతున్నాయి. మామగారు కళానిధి మారన్, భార్య కావ్యతో కలిసి అనిరుధ్ మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపించిన క్యాండిడ్ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివరి ఫోటోలో సముద్ర తీరాన నిలబడి, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కళ్లలోకి చూసుకుంటున్న దృశ్యం సినీ సన్నివేశాన్ని తలపిస్తోంది.
మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి
ఈ ఫోటోలను పంచుకుంటూ వేడుకకు హాజరైన అతిథులకు అనిరుధ్ కృతజ్ఞతలు తెలిపారు. "మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆశీస్సులను మాటల్లో వర్ణించలేం. మా కొత్త జీవితాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. మీ అందరి ప్రేమను ఎల్లప్పుడూ మాతోనే మోసుకెళ్తాం" అని అనిరుధ్ భావోద్వేగంగా పేర్కొన్నారు.