Anupama Parameswaran About JioHotstar OTT Trending Movie: సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా "క్రేజీ కళ్యాణం".
క్రేజీ కళ్యాణం సినిమాకు ఆదరణ

ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు బద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. ఇటీవలే "క్రేజీ కళ్యాణం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఆకట్టుకుంటోంది.
అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
ఈ నేపథ్యంలో క్రేజీ కళ్యాణం సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ ట్రెండింగ్ అవుతున్న సినిమా గురించి చెప్పుకొచ్చారు.
మంచి సినిమా రావాలంటే
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. "మేము థియేటర్స్ విజిట్స్‌కి వెళ్లినప్పుడు ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం. ఇలాంటి మంచి సినిమా రావాలంటే బద్రప్ప లాంటి దర్శకుడు, జగన్ గారి లాంటి ప్రొడ్యూసర్, డా. గోరటి వెంకన్న లాంటి లిరిసిస్ట్, సురేష్ బొబ్బిలి లాంటి మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా టీమ్ అంతా ఉండాలి" అని అన్నారు.
గట్స్, ప్యాషన్ ఉండాలి
"ఇలాంటి సబ్జెక్ట్‌ను నమ్మి సినిమా చేయాలంటే గట్స్, ప్యాషన్ ఉన్న ఇలాంటి టీమ్ కావాలి. పరదా సినిమా చేసినప్పుడు ఆ మూవీ కంటెంట్ మీద నమ్మకం ఉంది అని చెప్పాను. ఈ రోజు హాట్‌స్టార్‌లో ఆ సినిమా నెం.1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ప్రశంసిస్తారు అనేందుకు ఆ సినిమా ఎగ్జాంపుల్" అని అనుపమ పరమేశ్వరన్ అభిప్రాయపడ్డారు.
వినోదంతోపాటు మెసేజ్ కూడా
{{/usCountry}}"ఇలాంటి సబ్జెక్ట్‌ను నమ్మి సినిమా చేయాలంటే గట్స్, ప్యాషన్ ఉన్న ఇలాంటి టీమ్ కావాలి. పరదా సినిమా చేసినప్పుడు ఆ మూవీ కంటెంట్ మీద నమ్మకం ఉంది అని చెప్పాను. ఈ రోజు హాట్‌స్టార్‌లో ఆ సినిమా నెం.1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ప్రశంసిస్తారు అనేందుకు ఆ సినిమా ఎగ్జాంపుల్" అని అనుపమ పరమేశ్వరన్ అభిప్రాయపడ్డారు.
వినోదంతోపాటు మెసేజ్ కూడా
{{/usCountry}}"నేను నా కెరీర్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలను ప్రయత్నిస్తున్నాను. దాంతో ప్రేక్షకులకు వినోదంతో పాటు ఒక చిన్న మెసేజ్ కూడా ఇవ్వగలుగుతున్నా. కొత్తగా మీకు ఏదో చెప్పాలని అనుకుంటాను" అని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు.
అందుకే షోస్ పెరుగుతున్నాయి
"నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా నరేష్ గారి లాంటి ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి స్టోరీస్‌ను సపోర్ట్ చేయడాన్ని ఇష్టపడతాను. ఫ్యామిలీస్ మా సినిమాను యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకే షోస్ పెరుగుతున్నాయి. హౌస్ ఫుల్స్ అవుతున్నాయి" అని హీరోయిన్ అనుపమ చెప్పుకొచ్చారు.
కేరళ అమ్మాయి అయినా కూడా
నటి నీల ప్రియ మాట్లాడుతూ.. "క్రేజీ కళ్యాణం లాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కేరళ అమ్మాయి అయినా అనుపమ తెలుగింటి అమ్మాయిలా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకుంది. ప్రేక్షకుల ఆదరణ వల్లే మా సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడింది" అని అన్నారు.
థియేటర్ సెలెన్స్ అవుతోంది
"మా క్రేజీ కళ్యాణం సినిమా థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చూశాను. థియేటర్ నిండిపోయింది. ప్రేక్షకులు తెరపై కామెడీ సీన్స్ వస్తే నవ్వుతున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో థియేటర్ సైలెన్స్ అవుతోంది. చాలా మంది అమ్మాయిలు తమ పేరెంట్స్‌తో కలిసి మా సినిమా చూసేందుకు రావడం సంతోషంగా ఉంది" అని నటుడు గౌరిశంకర్ పంచుకున్నారు.