బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ‘ధురంధర్’ చిత్రం 2008 ముంబై దాడుల నాటి భీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను వణికించింది. ఈ సినిమాలో పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI) మేజర్ ఇక్బాల్‌గా విలన్ రోల్‌లో ఆకట్టుకున్నారు అర్జున్ రాంపాల్. తాజాగా ఒక అవార్డు వేడుకలో 26/11 దాడులకు సంబంధించి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు అర్జున్.
సరిగ్గా నా పుట్టినరోజు నాడే..

"2008లో ముంబై దాడులు జరిగిన రాత్రి నా పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులను పికప్ చేసుకోవడానికి హోటల్‌కు వెళ్లాను. మేమంతా తాజ్ హోటల్‌కు బయలుదేరుతుండగా మాహిమ్ వద్ద మొదటి పేలుడు శబ్దం వినిపించింది. ఆ ధాటికి కారు అద్దాలు గజగజ వణికిపోయాయి. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు" అని అర్జున్ రాంపాల్ తెలిపారు.
ప్రాణభయంతో ఆ రాత్రి అక్కడే
"కొద్దిసేపటికే ఫోన్లు రావడం మొదలైంది. కొలాబాలో గ్యాంగ్ వార్ జరుగుతోందని అందరూ అనుకున్నారు. కానీ, అరగంటలోనే ఫోర్ సీజన్స్ హోటల్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ప్రాణభయంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది" అని అర్జున్ రాంపాల్ నాటి భయంకర దృశ్యాలను వివరించారు.
మూడుసార్లు వాంతులు
మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్తున్నప్పుడు రోడ్లపై కనిపించిన రక్తపాతం చూసి తట్టుకోలేకపోయానని, కారు ఆపి మూడుసార్లు వాంతులు చేసుకున్నానని అర్జున్ రాంపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతీకారం తీర్చుకోవడానికి
అందుకే దర్శకుడు ఆదిత్య ధర్ తనకు ఈ కథ చెప్పినప్పుడు, ఆ ఉగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదొక మార్గమని భావించినట్లు అర్జున్ రాంపాల్ తెలిపారు. "ధురంధర్ సినిమా ద్వారా నా ప్రతీకారం తీర్చుకున్నాను. భారత్ మాతా కీ జై" అంటూ అర్జున్ రాంపాల్ తన ప్రసంగాన్ని ముగించారు.
మేజర్ ఇక్బాల్ పాత్రలో అర్జున్..
ఇక 'ధురంధర్' మొదటి భాగంలో అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుంది. ముంబైలో ఉగ్రవాదులు నరమేధం సాగిస్తుంటే, అక్కడ పాకిస్థాన్‌లో పార్టీ చేసుకుంటూ వారిని నడిపించే హ్యాండ్లర్‌గా ఆయన నటించారు. అయితే, ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’లో రణ్వీర్ సింగ్ (హమ్జా) చేతిలో ఈ ఇక్బాల్ పాత్ర అత్యంత భయంకరంగా హతమవుతుంది.
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' ప్రభంజనం
{{/usCountry}}ఇక 'ధురంధర్' మొదటి భాగంలో అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుంది. ముంబైలో ఉగ్రవాదులు నరమేధం సాగిస్తుంటే, అక్కడ పాకిస్థాన్‌లో పార్టీ చేసుకుంటూ వారిని నడిపించే హ్యాండ్లర్‌గా ఆయన నటించారు. అయితే, ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’లో రణ్వీర్ సింగ్ (హమ్జా) చేతిలో ఈ ఇక్బాల్ పాత్ర అత్యంత భయంకరంగా హతమవుతుంది.
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' ప్రభంజనం
{{/usCountry}}మొదటి భాగం ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు సీక్వెల్ ‘ధురంధర్ 2’ ఆ రికార్డులను తిరగరాస్తోంది. మొదటి రోజే రూ. 145 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ధురంధర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే దేశీయంగా రూ. 450 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.