...
...
Next Story

అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య మద్యానికి బానిస- వదంతులపై యాక్షన్ కింగ్ ఫిర్యాదు- చిన్న కూతురు పెళ్లికి అల్లుడు రాకపోవడంతో!

Arjun Sarja Complaint On Rumours About Daughter: తన కూతురు ఐశ్వర్య అర్జున్ మద్యానికి బానిస అంటూ వస్తున్న అసత్య ప్రచారాలపై సీనియర్ హీరో అర్జున్ సర్జా ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత జీవితంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు అర్జున్ సర్జా వెల్లడించారు.

Published on: Nov 20, 2026, 10:57:48 IST
Advertisement

Arjun Sarja Complaint Against Derogatory Rumours About Daughter: తెలుగు, తమిళ చిత్రసీమల్లో 'యాక్షన్ కింగ్'గా పేరుగాంచిన సీనియర్ హీరో అర్జున్ సర్జా తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ విషయంలో వస్తున్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అర్జున్ చిన్న కుమార్తె అంజన వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

మద్యానికి బానిస

అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య మద్యానికి బానిస- వదంతులపై యాక్షన్ కింగ్ ఫిర్యాదు- చిన్న కూతురు పెళ్లికి అల్లుడు రాకపోవడంతో!
అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య మద్యానికి బానిస- వదంతులపై యాక్షన్ కింగ్ ఫిర్యాదు- చిన్న కూతురు పెళ్లికి అల్లుడు రాకపోవడంతో!

ఇంట్లో పెళ్లి సందడి ముగియకముందే.. పెద్ద కుమార్తె ఐశ్వర్య, ఆమె భర్త ఉమాపతి రామయ్య వివాహ బంధంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు హద్దుమీరి ఐశ్వర్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, ఆమెను మద్యానికి బానిస అంటూ అసత్య ప్రచారం చేయడంపై అర్జున్ గురువారం (నవంబర్ 19) ఒక ఘాటు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

అసత్య ఆరోపణలపై అర్జున్ ఆగ్రహం

అంజన వివాహ సమయంలో తమ కుటుంబానికి ప్రేమను, ఆశీస్సులను అందించిన ప్రతి ఒక్కరికీ అర్జున్ ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సంతోషకర సమయంలో ఐశ్వర్య గురించి బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అర్జున్ సర్జా.

ఐశ్వర్య వ్యక్తిగత గోప్యతకు తాను ఎల్లప్పుడూ గౌరవం ఇస్తానని, అవసరమైతే ఆమె స్వయంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని అర్జున్ పేర్కొన్నారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఐశ్వర్య వ్యక్తిత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తప్పుడు ప్రచారాలను ఇకపై ఉపేక్షించేది లేదని అర్జున్ సర్జా తేల్చి చెప్పారు. తమ మౌనాన్ని చేతకానితనంగా భావించి కొందరు మరింత రెచ్చిపోతున్నారని, అందుకే చట్టపరమైన చర్యలకు దిగినట్లు వివరించారు.

"మౌనమే అత్యంత గౌరవప్రదమైన సమాధానమని మేము ఎప్పుడూ నమ్ముతాము. కానీ, మౌనాన్ని ఎన్నటికీ అంగీకారంగా భావించకూడదు. తప్పుడు సమాచారం పదేపదే ప్రచారమయ్యేందుకు అది అవకాశం ఇవ్వకూడదు. అందుకే సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశాము" అని అర్జున్ వెల్లడించారు.

అండదండలు లేని మహిళలపై

తాను విడుదల చేసిన ఈ ప్రకటన కేవలం తన కుమార్తె కోసమే కాదని, సమాజంలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకమవుతున్న ప్రతి మహిళ తరఫున మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ అండదండలు లేని మహిళలపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే వారి జీవితాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఏ మహిళా ఇలాంటి పరిస్థితిని ఒంటరిగా ఎదుర్కోకూడదు, తాను ఎంచుకున్న జీవన విధానానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం రాకూడదు. గౌరవం, ఆత్మగౌరవం విషయంలో ఎన్నటికీ రాజీ పడకూడదు" అని అర్జున్ సర్జా పేర్కొన్నారు.

వివాదాలకు కారణమైన పరిణామాలు ఇవే..

2021లో అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'సర్వైవర్ తమిళ్' రియాలిటీ షోలో ఐశ్వర్య అర్జున్, సీనియర్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో 2023 అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2024 జూన్‌లో చెన్నైలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.

అయితే, ఈ ఏడాది అక్టోబర్‌లో ఇటలీలోని టస్కనీ వేదికగా అర్జున్ చిన్న కుమార్తె అంజన, ఐసయ్య నట్టర్‌ల వివాహం జరిగింది. ఈ వేడుకల్లో ఉమాపతి రామయ్య, ఆయన తండ్రి తంబి రామయ్య ఎక్కడా కనిపించకపోవడంతో నెటిజన్లలో అనుమానాలు మొదలయ్యాయి. నవంబర్ మొదటి వారంలో ఉమాపతి పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్య సోషల్ మీడియాలో ఎలాంటి శుభాకాంక్షలు తెలపకపోవడం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.

అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు

దీనికి తోడు, తంబి రామయ్య తనతో మాట్లాడారని, వారిద్దరి మధ్య పరిస్థితి తనకు తెలుసంటూ ఒక యూట్యూబర్ ఇటీవల వీడియో చేయడంతో వదంతులు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే అర్జున్ రంగంలోకి దిగి, తన కుమార్తెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరిక జారీ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks