భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఇవాళే. తన ప్రియురాలు సానియా ఛందోక్ ను అర్జున్ పెళ్లి చేసుకుంటున్నాడు. క్రికెటర్ అయిన అర్జున్ తన ప్రేయసి సానియా విసిరిన లవ్ యార్కర్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సానియా ఎవరో కాదు అర్జున్ చెల్లి సారా టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం.
అర్జున్ టెండూల్కర్ లవ్ స్టోరీ

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. కానీ అర్జున్ టెండూల్కర్ పెళ్లిని మాత్రం సారా టెండూల్కర్ నిర్ణయించిందని చెప్పొచ్చు. సారా కారణంగానే అర్జున్ కు సానియా ఛందోక్ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇవాళ (మార్చి 5) అర్జున్, సానియా మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
అలా మొదలైంది
అర్జున్ టెండూల్కర్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కుటుంబానికి, సానియా కుటుంబానికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. సానియా తాత రవి ఘాయ్ (గ్రావిస్ గ్రూప్ ఛైర్మన్), సచిన్ చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. సారా టెండూల్కర్, సానియా బెస్ట్ ఫ్రెండ్స్. సానియా ఎక్కువగా సారా కోసం సచిన్ ఇంటికి వచ్చేది. అలా సానియాతో అర్జున్ కు పరిచయం ఏర్పడింది.
చెల్లి సపోర్ట్ తో
అర్జున్ కు సానియాను సారా పరిచయం చేసింది. వీళ్ల లవ్ స్టోరీలో సారాది కీలక పాత్ర. సారా బెస్ట్ ఫ్రెండ్ అయిన సానియా మెల్లగా అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గా మారిపోయింది. వీళ్ల ప్రేమ గురించి ఇంట్లో తెలిసిన తర్వాత సచిన్ ఏం ఆలోచించకుండా పెళ్లికి ఒప్పుకొన్నాడు. 25 ఏళ్ల అర్జున్ కంటే సానియా (26) ఒక ఏడాది పెద్దది. సచిన్ కంటే కూడా అతని భార్య అంజలి వయసులో పెద్దది అన్న విషయం తెలిసిందే.
పెట్ స్పా
సానియా ఛందోక్ ఓ బిజినెస్ వుమెన్. సొంతంగా ఓ పెట్ స్పాను నడుపుతోంది. మరోవైపు తన క్రికెటింగ్ కెరీర్ ను నిర్మించుకునే ప్రయత్నాల్లో అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు. ఐపీఎల్ లో గతంలో ముంబయి ఇండియన్స్ కు ఆడిన అర్జున్.. ఐపీఎల్ 2026 కోసం లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ తో చేరాడు. అర్జున్, సానియా ఆగస్టు 13, 2025న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
{{/usCountry}}సానియా ఛందోక్ ఓ బిజినెస్ వుమెన్. సొంతంగా ఓ పెట్ స్పాను నడుపుతోంది. మరోవైపు తన క్రికెటింగ్ కెరీర్ ను నిర్మించుకునే ప్రయత్నాల్లో అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు. ఐపీఎల్ లో గతంలో ముంబయి ఇండియన్స్ కు ఆడిన అర్జున్.. ఐపీఎల్ 2026 కోసం లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ తో చేరాడు. అర్జున్, సానియా ఆగస్టు 13, 2025న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
{{/usCountry}}అర్జున్, సానియా పెళ్లి
అర్జున్ టెండూల్కర్, సానియా పెళ్లి గురువారం జరుగుతోంది. ఈ వెడ్డింగ్ కు సచిన్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అవుతున్నట్లు తెలిసింది. క్రికెట్ వర్గాల నుంచి ధోని, వీవీఎస్ లక్ష్మణ్, సౌరభ్ గంగూలీ తదితర మాజీలు పెళ్లికి వెళ్తున్నారని సమాచారం.