మెడ పట్టుకుంటే తొడ కొట్టినట్టే-పవన్ కల్యాణ్ ఆరా ఆఫ్ ఉస్తాద్ వచ్చేసింది-అదిరిపోయే మ్యూజిక్-ఉస్తాద్ భగత్ సింగ్ రెండో సాంగ్

వెయిటింగ్ ఓవర్! భారీ హైప్ క్రియేట్ చేసిన ఆరా ఆఫ్ ఉస్తాద్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఇవాళ రిలీజైంది. పవన్ కల్యాణ్ మేనరిజంతో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ అదిరిపోయింది. 

Updated on: Feb 22, 2026, 20:05:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే.. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని ఈ సాంగ్ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సాంగ్ కు భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఎట్టకేలకు ఇవాళ రిలీజైన ఆరా ఆఫ్ ఉస్తాద్ నిజంగానే అదిరిపోయింది.

ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ (x/UBSTheFilm)
ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ (x/UBSTheFilm)

ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ సాంగ్ ఇవాళ (ఫిబ్రవరి 22) రిలీజ్ అయింది. హైప్ కు తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఈ సాంగ్ ఉంది. సాంగ్ లిరిక్స్, ఆరా ఆఫ్ ఉస్తాద్ వీడియోలో పవన్ మేనరిజంతో విజువల్స్ ఈ పాటను మరింత స్పెషల్ గా మార్చాయి.

మెడ పట్టుకుంటే

పవన్ కల్యాణ్ మేనరిజం చాలా ఫేమస్. ఆయన అలా మెడపై చేయి పెట్టాడంటే థియేటర్ ఊగిపోతుంది. ఇప్పుడు ఈ మేనరిజం బేస్ చేసుకునే ఆరా ఆఫ్ ఉస్తాద్ ను క్రియేట్ చేశారు. ‘‘నేను మెడ పట్టుకుంటే తొడ కొట్టినట్టే’’ అని పవన్ కల్యాణ్ వాయిస్ తో వచ్చే లైన్స్ తో ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి లాస్ట్ వరకూ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

వాళ్లతో మేనరిజం

సాధారణంగా లిరికల్ వీడియో సాంగ్ లో హీరో హీరోయిన్ల స్టిల్స్, మూవీ షూటింగ్ సీన్లు ఉంటాయి. ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ లో పవన్ కల్యాణ్ స్టిల్స్, షూటింగ్ విజువల్స్ తో పాటు మరో స్పెషాలిటీ కూడా ఉంది. పవన్ మేనరిజాన్ని కాపీ చేస్తున్న కామన్ పీపుల్ కూడా ఈ వీడియోలో కనిపించారు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ అలా గన్ పట్టుకుని స్టైలిష్ గా నడుస్తూ రావడం హైలైట్ గా నిలిచింది.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 26, 2026న రిలీజ్ కానుంది. ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటను చంద్రబోస్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్, ఎస్పీ అభిషేక్ ఈ పాట పాడారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More