ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ కామెరాన్ సృష్టించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మ్యాజిక్ మొదలైంది. కానీ, భారత బాక్సాఫీస్ వద్ద మాత్రం ఒక ఆసక్తికరమైన పోరు కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ హాలీవుడ్ విజువల్ వండర్ ఇండియాలో దురంధర్ దాటికి నిలబడలేకపోయింది.
తొలిరోజు 20 కోట్లు

అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా మొదటి రోజు ఇండియాలో రూ. 20.05 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. సాధారణంగా ఇవి మంచి నంబర్లే అనిపించినా అప్పటికే థియేటర్లలో ఉన్న ‘ధురంధర్’ జోరు ముందు ఇవి తక్కువగానే కనిపిస్తున్నాయి.
నిజానికి అవతార్ 3 మొదటి రోజు భారత్‌లో రూ. 30 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద అజేయంగా దూసుకుపోతుండటంతో అవతార్ 3 అంచనాలు తలకిందులయ్యాయి.
15వ రోజు కలెక్షన్స్ కంటే తక్కువ
విచిత్రం ఏంటంటే, విడుదలైన 15వ రోజు కూడా ‘ధురంధర్’ సినిమా ఇండియాలో రూ. 22.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే, ఒక సరికొత్త హాలీవుడ్ భారీ చిత్రం ఓపెనింగ్ డే సాధించిన దాని కంటే, 15 రోజుల పాత హిందీ సినిమా ఎక్కువుగా వసూలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వారాంతాల్లో భారీ జంప్స్ చూపిస్తూ సాధారణ రోజుల్లోనూ నిలకడగా రాణిస్తూ రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ తన హవాను కొనసాగిస్తోంది. దీనితో పోలిస్తే ఇండియాలో అవతార్ 3 ప్రభావం ఆశించిన స్థాయిలో లేదనే చర్చ మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్ 3’ ప్రభంజనం
ఇండియాలో అవతార్ 3 పరిస్థితి ఎలా ఉన్నా అంతర్జాతీయంగా మాత్రం జేమ్స్ కామెరాన్ తన సత్తా చాటుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లో 43.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 386 కోట్లు) వసూలు చేసినట్లు డెడ్లైన్ నివేదిక పేర్కొంది.
{{/usCountry}}ఇండియాలో అవతార్ 3 పరిస్థితి ఎలా ఉన్నా అంతర్జాతీయంగా మాత్రం జేమ్స్ కామెరాన్ తన సత్తా చాటుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లో 43.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 386 కోట్లు) వసూలు చేసినట్లు డెడ్లైన్ నివేదిక పేర్కొంది.
{{/usCountry}}ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో 2025లో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా అవతార్ ఫైర్ అండ్ యాష్ నిలిచింది. ఇక చైనాలో కూడా తొలిరోజే 17.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 153 కోట్లు) వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద నంబర్ 1 స్థానంలో నిలిచింది అవతార్ 3. అక్కడ ప్రేక్షకులనుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ధురంధర్ కలెక్షన్ల సునామీ
ఇక మరోవైపు అక్షయ్ ఖన్నా, రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ అద్భుతమైన బాక్సాఫీస్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మొదటి రోజు రూ. 28 కోట్లతో మొదలైన ఈ సినిమా తొలి వారం ముగిసేసరికి రూ. 207.25 కోట్లు రాబట్టింది. రెండో వారంలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా రూ. 253.25 కోట్లు వసూలు చేసింది.
దీనితో రెండు వారాల్లోనే దురంధర్ ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 483.15 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 710.5 కోట్లు (14 రోజుల వరకు) వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
భారతీయ సినిమాల సత్తా
ఇప్పుడు 15వ రోజు వసూళ్లను కూడా కలిపితే ఈ దురంధర్ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అవతార్ 3 వంటి భారీ సినిమా కూడా ‘ధురంధర్’ దాటిని తట్టుకోలేకపోవడం భారతీయ సినిమాల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.