Avengers Endgame: విశ్వాన్ని కాపాడే హీరోల కథ- అవెంజర్స్ ఎండ్‌గేమ్ రీ రిలీజ్-అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్-డూమ్స్‌డే ట్విస్ట్

Avengers Endgame Encore Re Release Advance Booking: మార్వెల్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్’ రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇందులో డూమ్స్‌డే‌కి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ట్విస్ట్ ఇవ్వనున్నారు.

Published on: Sep 11, 2026, 21:38:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Avengers Endgame Encore Re Release Advance Booking: హాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) మాయాజాలం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్’ చిత్రం బిగ్ స్క్రీన్లపై రీఎంట్రీ ఇస్తోంది.

విశ్వాన్ని కాపాడే హీరోల కథ- అవెంజర్స్ ఎండ్‌గేమ్ రీ రిలీజ్-అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్-డూమ్స్‌డే ట్విస్ట్
విశ్వాన్ని కాపాడే హీరోల కథ- అవెంజర్స్ ఎండ్‌గేమ్ రీ రిలీజ్-అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్-డూమ్స్‌డే ట్విస్ట్

అవెంజర్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్

అంటే, అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ను ఎన్‌కోర్ టైటిల్‌తో రీ రిలీజ్ చేస్తోంది మార్వెల్ సంస్థ. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సంబంధించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్ టికెట్ బుకింగ్స్‌ను మార్వెల్ స్టూడియోస్ అధికారికంగా ప్రారంభించింది.

అత్యాధునిక ఫార్మాట్లలో ఆస్వాదించే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లోనూ మార్వెల్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు అవెంజర్స్ చిత్రాలకు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుంటాయి. మళ్లీ ఆ జ్ఞాపకాలను, విజువల్ వండర్‌ను అత్యంత అత్యాధునిక ఫార్మాట్లలో ఆస్వాదించే అవకాశం లభించడంతో ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు.

ప్రీమియం ఫార్మాట్లలో విజువల్ హంగామా

ఈసారి ‘ఎండ్‌గేమ్’ను కేవలం మామూలు స్క్రీన్లలోనే కాకుండా భారీ థియేట్రికల్ అనుభూతిని అందించేలా రూపొందించారు. ఐమాక్స్ (IMAX), ఇన్ఫినిటీ విషన్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి అడ్వాన్స్‌డ్ ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

తెలుగు భాషలోనూ అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ రిలీజ్

అత్యంత క్లియర్ విజువల్, దద్దరిల్లే సౌండ్ ఎఫెక్ట్స్‌తో వీక్షకులకు కళ్లు చెదిరే అనుభవాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్ సినిమా తెలుగు భాషలోనూ అందుబాటులోకి రానుంది.

‘డూమ్స్‌డే’ ఎక్స్‌క్లూజివ్ లుక్.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

ఈ అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్ రీ-రిలీజ్ వెనుక మరో పెద్ద సర్‌ప్రైజ్ దాగి ఉంది. రాబోయే మార్వెల్ భారీ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను ఈ ‘ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్’ ప్రదర్శనలో చూపించనున్నారు. డిసెంబర్ 18న రాబోతున్న ‘డూమ్స్‌డే’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఈ ప్రత్యేక ప్రదర్శన అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచనుంది.

విశ్వాన్ని కాపాడే చివరి పోరాటం

ఇక ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ కథ విషయానికొస్తే.. విలన్ థానోస్ తెచ్చిన వినాశనం వల్ల విశ్వంలో సగం జనాభా నాశనమవుతుంది. సర్వస్వం కోల్పోయిన సూపర్ హీరోలు ఆ తీవ్ర శోకం నుంచి తేరుకుని, కాలంలో వెనక్కి వెళ్లి మళ్లీ అందరినీ ఎలా బతికించారనేది అసలు కథ. తమ శక్తులన్నింటినీ ధారపోసి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి థానోస్‌పై సాధించిన విజయం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

టికెట్ల కోసం ఫ్యాన్స్ పోటీ

కెవిన్ ఫైజ్ నిర్మాణంలో ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్‌కోర్ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, టికెట్ల కోసం ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More