ఇవాళ ఓటీటీలోకి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తమిళ సూపర్ హిట్ మూవీ వచ్చేసింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమానే ‘అయలాన్’. ఇది తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. భూమిపైకి వచ్చే ఏలియన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆ ఏలియన్ కు హీరో ఎలా సాయం చేశాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
అయలాన్ ఓటీటీ

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అయలాన్ ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది. ఈ సినిమా బుధవారం (జనవరి 7) నుంచి ఆహా వీడియో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించారు. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగు ఓటీటీ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఇప్పుడిక స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయొచ్చు.
రెండేళ్లకు
అయలాన్ మూవీ రెండేళ్లకు ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ సినిమా 2024లో సంక్రాంతి స్పెషల్ గా రిలీజైంది. అప్పుడు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. పాజిటివ్ టాక్ తో రూ.83 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు రెండేళ్లకు అంటే 2026లో మళ్లీ సంక్రాంతికి ముందు ఈ మూవీ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
అయలాన్ స్టోరీ
ఓ ప్రత్యేక కారణం కోసం భూమి పైకి వచ్చే ఓ ఏలియన్, దానికి సాయం చేసే హీరో చుట్టూ సాగే కథనే అయలాన్. ఇందులో తామిజ్ (శివ కార్తికేయన్) వ్యవసాయం చేస్తుంటాడు. కానీ జాబ్ చేయాలనే లక్ష్యంతో సిటీకి వస్తాడు. మరోవైపు వేరే గ్రహం నుంచి టాట్టూ అనే ఓ ఏలియన్ భూమి మీదకు వస్తుంది. టాట్టూతో తామిజ్ కు పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు.
ఆ కారణంతో
అసలు టాట్టూ ఈ భూమ్మీదకు ఎందుకు వచ్చిందనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ ఖేల్కర్) ప్రయోగాలు చేస్తుంటాడు. పెట్రోల్, డీజిల్ కు ఆల్టర్నేటివ్ గా మరో గ్యాస్ నోవా గ్యాస్ ను కనిపెట్టాలని ట్రై చేస్తుంటాడు. అందుకోసం ఇండియాలోని ఓ మైన్ లో సీక్రెట్ గా ప్రయోగాలు చేస్తాడు.
{{/usCountry}}అసలు టాట్టూ ఈ భూమ్మీదకు ఎందుకు వచ్చిందనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో సైంటిస్ట్ ఆర్యన్ (శరద్ ఖేల్కర్) ప్రయోగాలు చేస్తుంటాడు. పెట్రోల్, డీజిల్ కు ఆల్టర్నేటివ్ గా మరో గ్యాస్ నోవా గ్యాస్ ను కనిపెట్టాలని ట్రై చేస్తుంటాడు. అందుకోసం ఇండియాలోని ఓ మైన్ లో సీక్రెట్ గా ప్రయోగాలు చేస్తాడు.
{{/usCountry}}అయితే ఆర్యన్ స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగిస్తాడు. మరి భూమ్మీదకు వచ్చిన టాట్టూకు ఈ స్పార్క్ కు సంబంధం ఏంటీ? టాట్టూకు తామిజ్ ఎలాంటి సాయం చేశాడన్నది అయలాన్ మూవీలో చూడాల్సిందే. ఆహా వీడియో ఓటీటీలో ఇది తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.