Telugu Heroine Ayesha Khan On ₹370 Biryani Controversy: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, కాసేపు నవ్వుల కోసం చేసే కొన్ని పనులు ఒక్కోసారి ఎంతటి తీవ్ర వివాదాలకు దారితీస్తాయో చెప్పడానికి తాజా '370 రూపాయల బిర్యానీ వివాదం' ఒక ఉదాహరణ. గురుగ్రావ్‌లో జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
అనాగరిక ఆలోచనలు

మహిళల పట్ల మగవారిలో ఉన్న అనాగరిక ఆలోచనలను, 'సమ్మతి' (Consent) అనే ప్రాథమిక సూత్రాన్ని కించపరిచేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే, సదరు కమెడియన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది.
అసలు ఈ రూ. 370 బిర్యానీ వివాదం ఏంటి?
ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే గురుగ్రామ్‌లో ఒక షో నిర్వహించారు. స్టాండప్ కామెడీలో భాగంగా స్టేజ్ మీదున్న కమెడియన్లు ఆడియన్స్‌తో మాట్లాడటం (Crowd Work) సాధారణం. ఈ క్రమంలో హిమాన్షు జంగ్రా (23) అనే యువకుడు తాను ఒక అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లినప్పటి అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ అమ్మాయికి రూ. 370 పెట్టి బిర్యానీ కొనిపించానని, అందుకు బదులుగా ఆమె నుంచి శారీరక సాన్నిహిత్యాన్ని ఆశించానని ఆ యువకుడు చెప్పాడు.
పీక్ గుర్‌గావ్ కంటెంట్
"నేను రూ. 370 ఖర్చు పెట్టాను, కాబట్టి ఆ డబ్బును వసూలు చేసుకోవాలి కదా" అని ఆ యువకుడు అన్నాడు. ఈ అభ్యంతరకరమైన కామెంట్‌కు అక్కడ కూర్చున్న చాలా మంది పురుషులు పెద్దగా నవ్వారు. వేదికపై ఉన్న కమెడియన్ ప్రణిత్ మోరే కూడా ఆ మాటలకు విపరీతంగా నవ్వుతూ, దానిని సమర్థించాడు.
అంతటితో ఆగకుండా, ఈ సీన్‌ను "పీక్ గుర్‌గావ్ కంటెంట్" అంటూ సోషల్ మీడియాలో రీల్ రూపంలో పోస్ట్ చేశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని, శరీరాన్ని రూ. 370 బిర్యానీతో పోల్చడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
"చూడటానికే భయంగా ఉంది".. ఆయేషా ఖాన్ ఆగ్రహం
{{/usCountry}}అంతటితో ఆగకుండా, ఈ సీన్‌ను "పీక్ గుర్‌గావ్ కంటెంట్" అంటూ సోషల్ మీడియాలో రీల్ రూపంలో పోస్ట్ చేశారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని, శరీరాన్ని రూ. 370 బిర్యానీతో పోల్చడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
"చూడటానికే భయంగా ఉంది".. ఆయేషా ఖాన్ ఆగ్రహం
{{/usCountry}}ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వివాదంపై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. హిందీ బిగ్‌బాస్ ఫేమ్, తెలుగు హీరోయిన్, ధురంధర్ బ్యూటీ ఆయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
"ఆ హాల్‌లో ఉన్న ప్రతి మగాడు ఆ దారుణమైన కామెంట్‌కు నవ్వుతున్న తీరు చూస్తుంటేనే భయం వేస్తోంది. హోస్ట్ అంతలా నవ్వడం, ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టే ముందు కనీసం ఆలోచించకపోవడం మరీ ఘోరం. మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి విషయాలపై మనం తగినంతగా స్పందించడం లేదు" అని ఆయేషా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎటు వైపు వెళ్తున్నాం?
"నువ్వు ఒక డేట్‌కు వెళ్లి కేవలం రూ. 370 ఖర్చు పెడితే, అవతలి అమ్మాయి శరీరంపై నీకు హక్కు వచ్చేస్తుందా? మనం అసలు ఎటు వైపు వెళ్తున్నాం? జనాలు ఏమైపోతున్నారు?" అని ఆయేషా ఖాన్ సూటిగా ప్రశ్నించారు.
అకౌంట్ డిలీట్ చేసిన కమెడియన్
నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో ట్రోలింగ్ ఎదురవడంతో కమెడియన్ ప్రణిత్ మోరే ఎట్టకేలకు స్పందించారు. తన తప్పును ఒప్పుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసి, ఆ తర్వాత తన అకౌంట్‌ను డియాక్టివేట్ చేసుకున్నారు.
"ఇటీవలి షో క్లిప్‌పై వస్తున్న విమర్శలను నేను చూశాను. ఆ ప్రేక్షకుడు చేసిన వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ సమయంలో ఆ కామెంట్‌కు నవ్వి ఊరుకోకుండా నేను అతనిని గద్దించాల్సింది. అది నా వైపు నుంచి జరిగిన పెద్ద తప్పు" అని ప్రణిత్ మోరే పేర్కొన్నారు.
నా తప్పును ఎత్తిచూపిన వారికి కృతజ్ఞతలు
"నా తప్పును సున్నితంగా ఎత్తిచూపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ ఘటనకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నేను కూడా ఒక మనిషినే, జీవితంలో నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను" అని ప్రణీత్ మోరే ముగించారు. కాగా 370 బిర్యానీ గురించి మాట్లాడిన యువకుడు హిమాన్షు జంగ్రా తన ఉద్యోగాన్ని కోల్పోవడం గమనార్హం.