OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో సూపర్ హిట్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఇంటి మిస్టరీ గుట్టు రట్టు? తెలుగులో స్ట్రీమింగ్!

Ayyana Mane Season 2 OTT Release Telugu: కన్నడలో సంచలనం సృష్టించిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయ్యన మనే సీజన్ 2 ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్ ముగించిన ఉత్కంఠభరితమైన మలుపులకు సమాధానంగా అయ్యన మనే 2 తెలుగులో ఓటీటీ రిలీజ్ కానుంది. మరి ఆ వివరాలపై లుక్కేద్దాం.

Updated on: Oct 22, 2026, 20:52:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ayyana Mane Season 2 OTT Streaming In Telugu: భారతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవల ప్రాంతీయ కంటెంట్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. థ్రిల్లర్, మిస్టరీ జోనర్ సిరీస్‌లకు భాషా సరిహద్దులతో సంబంధం లేకుండా నిలకడగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం కన్నడ డిజిటల్ ప్రపంచంలో విడుదలై సంచలనం సృష్టించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సైకలాజికల్ డ్రామా ఓటీటీ సిరీస్ 'అయ్యన మనే'.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో సూపర్ హిట్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఇంటి మిస్టరీ గుట్టు రట్టు? తెలుగులో స్ట్రీమింగ్!
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో సూపర్ హిట్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఇంటి మిస్టరీ గుట్టు రట్టు? తెలుగులో స్ట్రీమింగ్!

విమర్శకుల ప్రశంసలు

విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ హిట్ సిరీస్‌కు సంబంధించిన రెండో భాగం ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేయనుంది. 'అయ్యన మనే 2' పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ రేపటి (అక్టోబర్ 23) నుంచి తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఒకే ఇల్లు.. అవే పాత్రలు.. కానీ రెట్టింపు ఉత్కంఠ!

మొదటి భాగం ముగిసిన చోటు నుంచే కథలోని రహస్యాలను వెలికితీసేలా ఈ కొత్త సీజన్‌ను తీర్చిదిద్దారు. "ఆ రోజు రాత్రి అక్కడ అసలు ఏం జరిగింది?" అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు ఈ భాగంలో స్పష్టమైన సమాధానాలు లభించనున్నాయి. పాత ఇల్లు, అవే ప్రధాన పాత్రల నేపథ్యంతో కథ సాగినప్పటికీ, కథనంలో వచ్చే అనూహ్య మలుపులు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటాయని చిత్రబృందం ధీమాగా ఉంది.

నాణ్యమైన కంటెంట్‌కు పట్టం గట్టిన ప్రేక్షకులు

"కన్నడ పరిశ్రమ నుంచి నాణ్యమైన, వైవిధ్యమైన ఒరిజినల్ కంటెంట్ రాగలదని 'అయ్యన మనే' మొదటి సీజన్ నిరూపించింది. తొలి భాగానికి వచ్చిన అపూర్వ స్పందనే మమ్మల్ని రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా, ఉన్నత ప్రమాణాలతో రూపొందించేలా ప్రోత్సహించింది" అని ప్రముఖ నిర్మాత శ్రుతి నాయుడు తెలిపారు.

ప్రధాన పాత్రలో తెలుగు నటి ఖుషి రవి

దర్శకుడు రమేష్ ఇందిరా అయ్యన మనే సీజన్ 2 కథను ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ ఓటీటీ సిరీస్‌లో రూపేష్ శెట్టి, తెలుగు నటి ఖుషి రవి, అక్షయ్ నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు.

మొత్తం 6 ఎపిసోడ్ల సస్పెన్స్ డ్రామా

మొత్తం 6 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్, ఇతర భాషా చిత్రాలకు సవాలు విసిరేలా సాంకేతికంగా మెరుగైన ప్రమాణాలతో రూపొందింది. విలక్షణమైన కథాంశాలతో వచ్చే ఈ తరహా డిజిటల్ కంటెంట్‌ను సస్పెన్స్ ప్రియులు ఆదరిస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు.

అయ్యన మనే ఓటీటీ స్ట్రీమింగ్

సూపర్ హిట్ సిరీస్‌గా పేరొందిన అయ్యన మనే 2 ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5లో అయ్యన మనే 2 ఓటీటీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 అంటే రేపటి నుంచి కన్నడ, తమిళం, తెలుగు, హిందీ వంటి నాలుగు భాషల్లో జీ5లో అయ్యన మనే ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More