Baahubali The Epic Box Office Collection Day 3: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కెరీర్‌లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ అయిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ సినిమాలను బాహుబలి ది ఎపిక్‌గా రీ రిలీజ్‌తో మళ్లీ తెరపైకి వచ్చాయి.
అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన

రీమాస్టర్ చేయబడిన బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ, రెండో రోజు నుంచి మాత్రం ప్రభాస్ రెండు పాత్రలు పోషించిన బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ వద్ద మందగించింది.
అడ్వాన్స్ బుకింగ్ నెట్ కలెక్షన్స్
బాహుబలి ది ఎపిక్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇండియాలో రూ. 1.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రిలీజైన అక్టోబర్ 31 నాడు రూ. 9.5 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది బాహుబలి ది ఎపిక్ మూవీ. ఇందులో తెలుగు ద్వారా రూ. 7.9 కోట్లు, హిందీలో 1.35 కోట్లు, కన్నడలో 0.02 కోట్లు, తమిళంలో 0.2 కోట్లు, మలయాళంలో 0.18 కోట్ల కలెక్షన్స్ ఉన్నాయి.
తగ్గిపోయిన వసూళ్లు
ఓపెనింగ్ కుమ్మెసిన బాహుబలి ది ఎపిక్ సినిమాకు రెండో రోజు కలెక్షన్స్ ఇండియాలో తగ్గిపోయాయి. సుమారు 26 శాతం వరకు పడిపోయాయి. దాంతో రెండో రోజున రానా దగ్గుబాటి విలన్‌గా చేసిన ఈ సినిమాకు 7.3 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి.
తెలుగులోనే ఎక్కువగా
ఇందులో తెలుగు నుంచి 4.9 కోట్లు, హిందీ ద్వారా 1.6 కోట్లు, కన్నడ నాట నుంచి 0.03 కోట్లు, తమిళం ద్వారా 0.6 కోట్లు, మలయాళంలో 0.17 కోట్ల నెట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక మూడో రోజు అయిన నవంబర్ 2న బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ మరింతగా దిగజారిపోయాయి.
3వ రోజు కలెక్షన్స్
{{/usCountry}}ఇందులో తెలుగు నుంచి 4.9 కోట్లు, హిందీ ద్వారా 1.6 కోట్లు, కన్నడ నాట నుంచి 0.03 కోట్లు, తమిళం ద్వారా 0.6 కోట్లు, మలయాళంలో 0.17 కోట్ల నెట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక మూడో రోజు అయిన నవంబర్ 2న బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ మరింతగా దిగజారిపోయాయి.
3వ రోజు కలెక్షన్స్
{{/usCountry}}మూడో రోజున ఇండియాలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 4.46 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది. అంటే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజున దాదాపుగా 28 శాతం వరకు బాహుబలి ది ఎపిక్ నెట్ కలెక్షన్స్ పడిపోయాయి.
3 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్
ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మూడు రోజుల్లో ఇండియాలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 22.56 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నవంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా ఈ సినిమాకు 50.50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
బాహుబలి ది ఎపిక్ థియేటర్ ఆక్యుపెన్సీ
ఇందులో ఉదయం షోలకు 39.27 శాతం, మ్యాట్నీకి 61.69 శాతం, ఫస్ట్ షోలకు 50.55 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. కాగా, 3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న బాహుబలి ది ఎపిక్ మూవీలో ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్‌గా రానా దగ్గుబాటి విలన్‌గా చేసిన విషయం తెలిసిందే.