నందమూరి బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా అఖండ 2. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్న అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
జన్మజన్మల బంధం మనది

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇన్ని కోట్ల మంది అభిమానుల ప్రేమను పొందడం పూర్వజన్మ సుకృతం. మనది జన్మజన్మల అనుబంధం" అని అన్నారు.
"మనిషి నిత్యవసర వస్తువులానే సినిమాని కూడా ఎంచుకున్నాడు. అలాంటి సినిమా ఎలా ఉండాలని చలనచిత్ర పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి. నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, యుగపురుషుడు నా తండ్రి నా గురువు నా ధైర్యం దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ వారి పాదాలకు నమస్కరిస్తున్నాను" అని బాలయ్య చెప్పారు.
ఆ చరిత్ర నాదే
"మొన్ననే గోపీచంద్ గారి దర్శకత్వంలో ఒక సినిమాని ప్రారంభించాం. 'చరిత్రలో చాలామంది ఉంటారు. చరిత్రని మరలా మరలా తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర నాదే ఆ చరిత్ర' ఆ సినిమాలోని డైలాగ్ ఇది. అలాంటి మంచి టెక్నీషియన్స్‌తో పని చేయడం నా అదృష్టం" అని బాలకృష్ణ పేర్కొన్నారు.
"సినిమా అంటే ఒక ఆత్మ. ఆ ఆత్మని పట్టుకోవాలి. నేనెప్పుడూ కూడా అభిమానుల గురించి ప్రేక్షకుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. మంచి సినిమా ఇవ్వాలి మంచి సందేశం ఇవ్వాలని పయత్నిస్తుంటాను. కరోనాతో భారతదేశమంతా భయపడుతున్న తరుణంలో అఖండ చిత్రాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్నాం. మంచి సినిమాకి విజయాన్ని చేకూర్చి ప్రోత్సహించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు" అని బాలకృష్ణ చెప్పారు.
నా ఆయుధానికి శక్తి శూలమై
{{/usCountry}}"సినిమా అంటే ఒక ఆత్మ. ఆ ఆత్మని పట్టుకోవాలి. నేనెప్పుడూ కూడా అభిమానుల గురించి ప్రేక్షకుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. మంచి సినిమా ఇవ్వాలి మంచి సందేశం ఇవ్వాలని పయత్నిస్తుంటాను. కరోనాతో భారతదేశమంతా భయపడుతున్న తరుణంలో అఖండ చిత్రాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్నాం. మంచి సినిమాకి విజయాన్ని చేకూర్చి ప్రోత్సహించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు" అని బాలకృష్ణ చెప్పారు.
నా ఆయుధానికి శక్తి శూలమై
{{/usCountry}}"మహా శివుడు శక్తి, ఆదిశక్తి సాక్షిగా గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో చెబుతున్నాను. ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, ఆ త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శూలమై.. ఎలా ఉండబోతుందో నా పాత్ర మీరు తెరపై చూస్తారు" అని బాలయ్య అన్నారు.
"బోయపాటి గారు నేను ఏదైనా సినిమా చేయాలనుకుంటే మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం. తర్వాత ఆ మహా యజ్ఞంలోకి దిగిపోతాం. నేను పాదరసం లాంటివాడిని ఎందులోకి వెళ్తే ఆ ఆకారం సంతరించుకుంటాను. నటుడిగా, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా, హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్ని రకాలుగా పనిచేయగలుగుతున్నాం అంటే అదంతా భగవంతుడు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు" అని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.
నా బాట సూటిగా ఉంటుంది
"నా బాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది. ఈ సినిమా విజయోత్సవ సభలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటాం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని బాలయ్య తెలిపారు
"మొన్న ఉత్తరప్రదేశ్‌కి వెళ్లాం. సీఎం యోగి ఆదిత్య నాథ్ గారు అఖండ 2 ట్రైలర్ చూశారు. దీంతోపాటు ఇంకొంత కంటెంట్ కూడా చూశారు. చాలా అభినందించారు. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు, సనాతనం ధర్మం శక్తి గౌరవం పరాక్రమాన్ని ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారని అభినందించారు" అని బాలకృష్ణ వెల్లడించారు.