Today OTT: ఆఫీస్ వర్క్, రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంతో అలిసిపోయిన వారికి ఒక స్వచ్ఛమైన సినిమా ఎంతో రిలాక్సేషన్ ఇస్తుంది. సరిగ్గా అలాంటి అద్భుతమైన ఫీల్ గుడ్ వైబ్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'బాలు గీత'. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రేమ కథలు

కొత్త దర్శకుడు ప్రతాప్ కొల్లారెడ్డి ఈ ‘బాలు గీత’ చిత్రాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించాడు. సాధారణంగా ప్రేమ కథలు పెళ్లితో ఎండ్ అవుతాయి. కానీ ఇందులో మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి (అరేంజ్డ్ మ్యారేజ్)కి ముందు ఇద్దరి మధ్య పరిచయం, ఆ తర్వాత వారిద్దరి మధ్య చిగురించే ప్రేమ, అనుబంధాలను చాలా సున్నితంగా చూపించారు.
ఇటీవల 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సరోజ్ ఇందులో హీరోగా నటించగా, కేయూరి షా హీరోయిన్ గా నటించింది. యూత్ కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు, ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు ఈ సినిమా కథ బాగా కనెక్ట్ అవుతుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ సపోర్ట్
ఈ బాలు గీత సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం విశేషం. సుప్రియ యార్లగడ్డ ఈ చిన్న సినిమాపై ఎంతో నమ్మకంతో సపోర్ట్ చేశారు. ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్ కో-ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. "ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా, ఇందులో చాలా బలమైన ఎమోషన్ ఉంది. కథ వినగానే ఈ సినిమా చేయాలనిపించింది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు. అలాగే గెస్ట్ గా వచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల సైతం ఈ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్టైల్ లో చాలా బ్రీజీగా ఉందని కామెంట్ చేశారు.
ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇదొక 'విన్ ఒరిజినల్ ఫిల్మ్' (A Win Original Film). థియేటర్ల కోసం కాకుండా ప్రత్యేకంగా ఓటీటీ ఆడియన్స్ కోసమే దీనిని రూపొందించారు. ఈ ఫీల్ గుడ్ మూవీ ఈ రోజు (నవంబర్ 5) నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా స్వచ్ఛమైన రొమాన్స్, కామెడీతో సాగే ఈ సినిమాను మీ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈటీవీ విన్ లో బాలు గీత సినిమాను వీక్షించండి.
{{/usCountry}}ఇదొక 'విన్ ఒరిజినల్ ఫిల్మ్' (A Win Original Film). థియేటర్ల కోసం కాకుండా ప్రత్యేకంగా ఓటీటీ ఆడియన్స్ కోసమే దీనిని రూపొందించారు. ఈ ఫీల్ గుడ్ మూవీ ఈ రోజు (నవంబర్ 5) నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా స్వచ్ఛమైన రొమాన్స్, కామెడీతో సాగే ఈ సినిమాను మీ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈటీవీ విన్ లో బాలు గీత సినిమాను వీక్షించండి.
{{/usCountry}}