OTT Telugu: లేటెస్ట్ తెలుగు యూత్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘బ్యాండ్ మేళం’ ఓటీటీలోకి వచ్చేసింది. కోర్ట్ మూవీతో పాపులర్ అయిన జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం ఇవాళ (ఏప్రిల్ 24) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మరోసారి తమ కెమిస్ట్రీతో రోషన్, శ్రీదేవి అలరించారు.
బ్యాండ్ మేళం ఓటీటీ

యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన తెలుగు మూవీ బ్యాండ్ మేళం. ఈ సినిమా శుక్రవారం ఓటీటీలో అడుగుపెట్టింది. నేటి నుంచే జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి.
‘‘నిరీక్షణ ముగిసింది. బ్లాక్ బస్టర్ జోడీ తిరిగొచ్చింది. జీ5లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న బ్యాండ్ మేళం మూవీని చూసేయండి’’ అని జీ5 తెలుగు తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది.
థియేటర్లో ఇలా
నాని ప్రొడ్యూసర్ గా తెరకెక్కించిన కోర్ట్ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఈ జోడీ యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాండ్ మేళం సినిమాలో కలిసి నటించారు. కానీ ఈ చిత్రానికి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వచ్చింది.
రోషన్, శ్రీదేవి కెమిస్ట్రీ అలరించినా బ్యాండ్ మేళం స్టోరీలో కొత్తదనం లేదనే విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు సతీశ్ జవ్వాజి డైరెక్టర్. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కింద కావ్య, శ్రావ్య ఈ సినిమాను నిర్మించారు.
బ్యాండ్ మేళం స్టోరీ
కోర్ట్ సినిమాతో మెప్పించిన రోషన్, శ్రీదేవి.. బ్యాండ్ మేళం సినిమాలో బావమరదళ్లుగా నటించారు. యాదగిరి అలియాస్ గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి)కి పెళ్లి చేయాలని వాళ్ల చిన్నప్పుడే పెద్దలు నిశ్చయిస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి.
{{/usCountry}}కోర్ట్ సినిమాతో మెప్పించిన రోషన్, శ్రీదేవి.. బ్యాండ్ మేళం సినిమాలో బావమరదళ్లుగా నటించారు. యాదగిరి అలియాస్ గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి)కి పెళ్లి చేయాలని వాళ్ల చిన్నప్పుడే పెద్దలు నిశ్చయిస్తారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి.
{{/usCountry}}గిరికి మ్యూజిక్ అంటే ఇష్టం. రాజీ ఏమో టాపర్. వీళ్లిద్దరి మధ్య విభేదాలు వస్తాయి. ఊర్లో ఫ్రెండ్స్ తో కలిసి గిరి మ్యూజిక్ బ్యాండ్ పెడతారు. మరోవైపు పై చదువుల కోసం రాజీ సిటీకి వెళ్తుంది.
ఆ ట్విస్ట్
రాజీనే తనకు కాబోయే పెళ్లాం అని గిరి కలలు కంటుంటాడు. కానీ రాజీ తండ్రి సాయన్న (సాయి కుమార్) మాత్రం తన కూతురిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వేరే వాళ్లతో పెళ్లికి రాజీ ఒప్పుకుందా? యాదగిరి ఏం చేశాడు? అన్నది బ్యాండ్ మేళం సినిమాలో చూడాల్సిందే.