OTT Telugu: ఇవాళ, రేపు వీకెండ్- ఓటీటీలో ఆహా అనిపించే 6 తెలుగు సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- హారర్ టు సర్వైవల్ థ్రిల్లర్!
Best 6 Aha OTT Release Movies Telugu This Weekend: ఇవాళ, రేపు వీకెండ్ సందర్భంగా ఓటీటీలో చూసేందుకు బెస్ట్ 6 తెలుగు సినిమాలు అందుబాటులో ఉన్నాయి. క్రైమ్, హారర్, కామెడీలు, యూత్‌ఫుల్ డ్రామా, సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్స్ వంటి జోనర్లలో ఉన్న టాప్ 6 ఓటీటీ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Best OTT Release Movies Telugu This Weekend: తెలుగు డిజిటల్ వినోద రంగంలో తనదైన ముద్ర వేసిన 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫామ్ రోజురోజుకీ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం రొటీన్ సినిమాలు మాత్రమే కాకుండా, యూత్‌ను థ్రిల్ చేసే విభిన్న జోనర్ సినిమాలతో తెలుగు డిజిటల్ ప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో ఏ సినిమా చూడాలా అని సబ్‌స్క్రైబర్లు వెతుకుతుంటారు. అలాంటి వారికోసం ఇవాళ, రేపు వీకెండ్ కోసం ఆహా అనిపించే టాప్ 6 ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సస్పెన్స్ థ్రిల్లర్లు.. భయపెట్టే హారర్ కాన్సెప్ట్‌లు
1. ఫారెస్ట్ గార్డ్ (Forest Guard):
రహస్యాలు, రాజకీయ కుట్రల నేపథ్యంతో సాగే సస్పెన్స్ సైకాలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. విధుల పట్ల అంకితభావం ఉన్న ఫారెస్ట్ గార్డ్ మిథున్, తన పాత స్నేహితులను దట్టమైన అడవిలోకి ఆహ్వానిస్తాడు. ప్రశాంతంగా సాగాల్సిన ఆ రాత్రి, అక్రమ వేటగాళ్లు, రాజకీయ కుట్రలతో తీవ్ర ఉత్కంఠగా మారుతుంది. ఎమ్‌సీ జోసెఫ్ దర్శకత్వంలో కతీర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షాజహాన్, సుధి కొప్పా నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
2. మహారాజా హాస్టల్ (Maharaja Hostel):
కాలేజ్ అల్లరి, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన సరికొత్త హారర్ కామెడీ 'మహారాజా హాస్టల్'. అరవింద్, వర్కీ, మిథున్ అనే ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు తక్కువ అద్దెకు దొరికే మహారాజా హాస్టల్‌లో చేరతారు. సీనియర్ల ర్యాగింగ్ భయంతో అర్ధరాత్రి అడవిలోని పాడుబడిన భవనంలోకి వెళ్లిన ఈ కుర్రాళ్లు, అక్కడ నిద్రపోతున్న దుష్టశక్తిని మేల్కొలుపుతారు. ఆ ఆత్మ హాస్టల్‌కు రావడం, ఆ తర్వాత జరిగే గందరగోళం నవ్వులు పూయిస్తుంది. అఖిల్ ఎన్‌ఆర్‌డి, శరత్ బాబు, సందీప్ ఎస్‌పి, అన్ మరియా నటించగా, చారు వాకన్ దర్శకత్వం వహించారు.
3. కర్మాఖ్య (Karmakhya):
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మిస్టీరియస్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ 'కర్మాఖ్య'. కామాఖ్య అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఫ్రెండ్ కోసం ఓ ఇంటికి వెళ్లిన ఆమె జీవితం భయంకరమైన ఘట్టాల వైపు తిరుగుతుంది. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, ఆమె పుట్టుకలో ఉన్న రహస్యాలు ఆమెను ఎలా వెంటాడాయనేది దర్శకుడు అభినయ్ కృష్ణ ఉత్కంఠభరితంగా మలిచారు. సమైరా, సముద్రఖని, అభిరామి, శరణ్య ప్రదీప్, ఆనంద్, మధునందన్ ముఖ్య పాత్రల్లో ఒదిగిపోయారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. బోల్డ్ అండ్ రొమాంటిక్ సిరీస్
4. హుషార్ పిట్టలు (Hushar Pittalu):
గ్రామీణ ప్రాంతంలో వికసించిన టీనేజ్ లవ్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రం తెరకెక్కింది. రవి, చిట్టి అనే ఇద్దరు యువతీ యువకులు చెడు ప్రభావాల వల్ల రహస్యంగా ప్రేమాయణం సాగిస్తారు. వీరి బంధాన్ని కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో, తిరుగుబాటు చేసి తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీశాయనేది ఈ చిత్ర కథాంశం. భిక్షు యాదవ్ దర్శకత్వంలో అన్ష్ తోరత్, వాసవి గణేషన్, ప్రాణి రెడ్డి నటించారు.
5. పురుషః (Purushaha):
బంధాల మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలని చెప్పే ఫ్యామిలీ థెరపిస్ట్ గోవింద్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. తన భార్య కమలతో పాటు, స్నేహితుల భార్యలు కూడా ఒకేసారి విడాకులకు దరఖాస్తు చేస్తారు. ఈ హృదయ విదారక పరిస్థితుల్లో నలుగురు పురుషులు తమ తప్పిదాలను ఎలా తెలుసుకున్నారు అనే కథాంశంతో 'పురుషః' తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ బట్టుల, సప్తగిరి, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, వెన్నెల కిషోర్ తమ పాత్రలతో మెప్పించారు.
6. ష్.. 3 (Sshhh 3 - Web Series):
అడల్ట్ ఆంథాలజీ విభాగంలో వచ్చిన బోల్డ్ అండ్ మెచ్యూర్ రొమాంటిక్ డ్రామా సిరీస్ 'ష్.. 3'. ఆధునిక బంధాల్లోని సంక్లిష్టతలు, డిజిటల్ లోకంలో మోసాలు, శారీరక సాన్నిహిత్యం, లైంగిక విద్యపై ఉన్న సామాజిక అపోహలను ఈ ఓటీటీ సిరీస్‌లో ధైర్యంగా చర్చించారు. హరీష్ జి.వై దర్శకత్వంలో పూనమ్ బజ్వా, దివి వాద్య, కిరణ్ రాథోడ్, దివ్య గణేష్ కీలక పాత్రలు పోషించారు.
హారర్ టు సర్వైవల్
మీకు థ్రిల్లర్, హారర్, కామెడీ లేదా రిలేషన్‌షిప్ డ్రామా, సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ఏదైనా నచ్చితే, ఈ వీకెండ్ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 6 విభిన్న కంటెంట్లను మిస్ కాకుండా ఎంచక్కా వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


