OTT Survival: ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్- అడుగడుగునా చావు భయం చూపించే అడవి అందాలు- 7.9 రేటింగ్!

Survival Thriller Photographer OTT Streaming: దట్టమైన అడవిలో అరుదైన మిస్టరీని ఛేదించే కథాంశంతో తెరకెక్కిన ఫాంటసీ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ఫొటోగ్రాఫర్ ఓటీటీలోకి వచ్చేసింది. అడుగడుగునా చావు భయం చూపించే అడవి అందాలతో సాగే ఫొటోగ్రాఫర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 26, 2026, 14:18:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Survival Thriller Photographer OTT Release: దట్టమైన అడవి.. ఊహకందని రహస్యాలు.. ఒక్క ఫొటోతో జీవితాన్నే మార్చేసుకోవాలనుకునే ఒక యువకుడి సాహసోపేత ప్రయాణం. వినోదప్రియులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచే సస్పెన్స్ చిత్రాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ విశేష ఆదరణ ఉంటుంది.

ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్- అడుగడుగునా చావు భయం చూపించే అడవి అందాలు- 7.9 రేటింగ్!
ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్- అడుగడుగునా చావు భయం చూపించే అడవి అందాలు- 7.9 రేటింగ్!

మిస్టీరియస్ సర్వైవల్ థ్రిల్లర్

అదే బాటలో విభిన్నమైన మిస్టీరియస్ ఫాంటసీ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం 'ఫొటోగ్రాఫర్' (Photographer) ప్రస్తుతం ఓటీటీలో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

గుర్తింపు కోసం అడవిబాట పట్టిన వీరా

ఆష్రఫ్ ఏ. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫొటోగ్రాఫర్ చిత్రంలో అష్రఫ్ అలీ, కలట్‌పడై జై, కరుణాకరన్, జనని సామంతనం కీలక పాత్రలు పోషించారు. తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం లేదన్న తీవ్ర అసంతృప్తితో ఉన్న వీరా (అష్రఫ్ అలీ) అనే ఫొటోగ్రాఫర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

అడవిలో అరుదైన దృశ్యం

కెరీర్‌లో ఎలాగైనా పెద్ద విజయం సాధించాలనే తపనతో ఉన్న అతనికి 'మ్యాథికెట్టన్ సోలై' అనే రహస్యమైన ఫారెస్ట్ రిజర్వ్ గురించి సమాచారం అందుతుంది. ఆ అడవిలో చాలా అరుదుగా సంభవించే ఒక అద్భుతమైన సహజ దృశ్యాన్ని తన కెమెరాలో బంధిస్తే తిరుగుండదని భావించి, ప్రాణాలకు తెగించి ఒంటరిగా అడవిలోకి అడుగుపెడతాడు.

ప్రకృతి అందాల చాటున దాగున్న భయం

అడవిలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో ప్రకృతి రమణీయత వీరాను ఎంతగానో అలరిస్తుంది. అయితే, అడవి లోపలికి వెళ్లేకొద్దీ అక్కడి ప్రతికూల వాతావరణం అతడిలో అసౌకర్యాన్ని పెంచుతుంది. తాను అన్వేషిస్తున్న ఆ అరుదైన దృశ్యం వెనుక ఏదో అసాధారణమైన మిస్టరీ ఉందనే నిజం మెల్లగా తెలుస్తుంది.

వెంటాడే గతం తాలూకు ఘటనలు

దీనికితోడు అతడి గతానికి సంబంధించిన ఘటనలు కూడా ఈ ప్రయాణంలో నీడలా వెంటాడుతాయి. తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తాడు వీరా. కానీ, అడుగడుగునా చావు భయం చూపిస్తుంది ఆ అడవి.

మిస్టరీని ఛేదించాడా? థ్రిల్ పంచే మలుపులు

ప్రాణాపాయం పొంచి ఉందని తెలిసినా ముందుకు సాగిన వీరా, చివరికి ఆ అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించగలిగాడా? ఆ దట్టమైన అడవి అతనికి నేర్పిన పాఠమేంటి? అక్కడ దాగి ఉన్న అసలు రహస్యమేంటి? అసలు ఆ అడవిలో వింతలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రాణాలతో వీరా బయటపడ్డాడా? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానంగా ముగింపు సాగుతుంది.

ఫొటోగ్రాఫర్ ఐఎమ్‌డీబీ రేటింగ్

ప్రశాంతమైన అడవి నేపథ్యంలో మొదలై ఉత్కంఠభరితమైన ఫాంటసీ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపాంతరం చెందే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఫొటోగ్రాఫర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ కూడా దక్కించుకుంది.

ఫొటోగ్రాఫర్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇంతటి థ్రిల్లింగ్ క్రేజీ సినిమా ఫొటోగ్రాఫర్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో నిన్న అంటే సెప్టెంబర్ 25న ఫొటోగ్రాఫర్ ఓటీటీ రిలీజ్ అయింది. వీకెండ్‌లో విభిన్నమైన సస్పెన్స్, ఫాంటసీ, థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో కూడిన సినిమాలను ఇష్టపడేవారికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఫొటోగ్రాఫర్ బెస్ట్ ఆప్షన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More