ప్రేమ.. అనిర్వచనీయమైన పదం ఇది. అర్థం చెప్పలేని అనుభూతి ఉంది. రెండు మనసులను కలిపే బంధం ఇది. ఒక్కో జనరేషన్ ఒక్కోలా మారుతున్నా, ఒక్కోలా పిలుస్తున్నా.. ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఈ రోజు వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14). ఈ స్పెషల్ రోజున మీ పార్టనర్ తో కలిసి ఓటీటీలో ఈ లవ్ స్టోరీలను చూసేయండి. మనసులో మరింత ప్రేమను నింపుకోండి.
సీతారామం

తెలుగు సినిమాల్లోని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీల్లో ‘సీతారామం’ ఒకటి అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా, ఇందులోని డైలాగ్ లు, ప్రేమ, క్లైమాక్స్.. ఇలా ప్రతీది అద్భుతమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించిన సీతారామం మాటల్లో వర్ణించలేని దృశ్య కావ్యం. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే. క్లైమాక్స్ లో మీ కళ్లు చెమర్చకుండా ఉండలేవు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది.
అర్జున్ రెడ్డి
తెలుగు సిని పరిశ్రమలోనే ఓ సంచలనం ‘అర్జున్ రెడ్డి’ మూవీ. ఇదో ట్రెండ్ సెట్టర్. లవ్, రొమాన్స్, కోపం.. ఇలా అన్నీ ఎక్స్ ట్రీమ్ గా చూపించిన సినిమా ఇది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీ ఓ క్లాసిక్. లవ్, రొమాన్స్, బోల్డ్, ఎమోషన్ సీన్లతో నిండిన ఈ సినిమా వాలెంటైన్స్ డే ఫర్ఫెక్ట్ మూవీ డేట్. ఇది జియోహాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఉంది.
జాను
మనలో చాలా మందికి స్కూల్, కాలేజీ రోజుల్లో కచ్చితంగా ఓ లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. మనం స్కూల్ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి 22 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ లో కలిస్తే ఎలా ఉంటుంది? ఆ ఎమోషన్లు ఎలా ఉంటాయి? అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన క్లీన్ లవ్ స్టోరీ ‘జాను’. ఇందులో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లు. తమిళ మూవీ 96కు రీమేక్ గా వచ్చిన ఈ ప్రేమ కథ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ఉంది.
ఫిదా
{{/usCountry}}మనలో చాలా మందికి స్కూల్, కాలేజీ రోజుల్లో కచ్చితంగా ఓ లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. మనం స్కూల్ రోజుల్లో ప్రేమించిన అమ్మాయి 22 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ లో కలిస్తే ఎలా ఉంటుంది? ఆ ఎమోషన్లు ఎలా ఉంటాయి? అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన క్లీన్ లవ్ స్టోరీ ‘జాను’. ఇందులో శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లు. తమిళ మూవీ 96కు రీమేక్ గా వచ్చిన ఈ ప్రేమ కథ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ఉంది.
ఫిదా
{{/usCountry}}తెలంగాణ యాసతో, ఇక్కడి కల్చర్ తో బిగ్ స్క్రీన్ పై సెన్సేషనల్ గా నిలిచిన మూవీ ‘ఫిదా’. ఇదో అద్భుతమైన లవ్ స్టోరీ సినిమా. ఇందులో వరుణ్ తేజ్, సాయి పల్లవి లీడ్ రోల్స్ ప్లే చేశారు. అమెరికాలో ఉండే అబ్బాయిని ప్రేమించినా.. కన్న తండ్రిని, ఉన్న ఊరును వదిలి వెళ్లలేని తెలంగాణ అమ్మాయి బాధ ఈ కథ. అది అర్థం చేసుకుని హీరోనే ఊరికి వచ్చేయడం హైలైట్. ఈ చిత్రం ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏ మాయ చేశావె
తెలుగు సినిమాల్లో మరో అందమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘ఏ మాయ చేశావె’. తన కంటే వయసులో పెద్దదైన జెస్సీని కార్తీక్ లవ్ చేయడం, తండ్రి కోసం ఆ ప్రేమను అమ్మాయి త్యాగం చేయాలనుకోవడమనే కథతో వచ్చిన ఈ సినిమా తెలుగు తెరపై ఓ అద్భుతం. ఇందులో నాగ చైతన్య, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు సినీ చరిత్రలో జెస్సీ, కార్తీక్ క్యారెక్టర్లు ఎప్పటికీ నిలిచిపోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ ప్రైమ్ వీడియో, జియోహాట్ స్టార్ లో ఉంది.