Lenin: ఒక్క సాలిడ్ హిట్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి అక్కినేని అఖిల్ ఎదురు చూస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ చేసినా అతనికి సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పడు ఆశలన్నీ ‘లెనిన్’ మూవీపైనే పెట్టుకున్నాడు. అయితే లెనిన్ మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేసిన హీరోయిన్ లుక్ పై మాత్రం నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.
భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే

లెనిన్ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇవాళ (మే 6) భాగ్యశ్రీ బర్త్ డే. ఈ సందర్భంగా లెనిన్ మూవీ నుంచి భాగ్యశ్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ పంచుకున్నారు. అయితే ఈ పోస్టర్ పై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి.
గుర్తుపట్టలేనంతగా
నిజానికి ఈ పోస్టర్ చూపించి ఈ హీరోయిన్ ఎవరని అడిగితే, ఎవరూ గుర్తుపట్టలేరని చెప్పొచ్చు. మూతిపై మీసాలతో, నెత్తిన కిరీటంతో ఓ రాజులా భాగ్యశ్రీ కనిపించింది. ‘‘ఎంతో టాలెంటెడ్ భాగ్యశ్రీ బోర్సేకు లెనిన్ టీమ్ నుంచి హ్యాపీ బర్త్ డే. తాను ఎప్పుడూ చేసేలాగే భారతి క్యారెక్టర్లోనూ తన మ్యాజిక్ తో మెస్మరైజ్ చేసేందుకు వచ్చేస్తుంది’’ అని సితారా ఎంటర్ టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
డిజాస్టర్ లుక్
భాగ్యశ్రీ బర్త్ డే సందర్భంగా బుధవారం లెనిన్ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఆమె లుక్ పై విమర్శలు వస్తున్నాయి. ‘డిజాస్టర్ లుక్’, ‘అసలే హైప్ లేదంటే ఇలాంటి పోస్టర్స్ తో ఏం ఉపయోగం? బర్త్ డేకు కామెడీ లుక్ ఏంటీ’ అని నెటిజన్లు కామెంట్లలో ఆడుకుంటున్నారు.
లెనిన్ గురించి
{{/usCountry}}భాగ్యశ్రీ బర్త్ డే సందర్భంగా బుధవారం లెనిన్ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఆమె లుక్ పై విమర్శలు వస్తున్నాయి. ‘డిజాస్టర్ లుక్’, ‘అసలే హైప్ లేదంటే ఇలాంటి పోస్టర్స్ తో ఏం ఉపయోగం? బర్త్ డేకు కామెడీ లుక్ ఏంటీ’ అని నెటిజన్లు కామెంట్లలో ఆడుకుంటున్నారు.
లెనిన్ గురించి
{{/usCountry}}అక్కినేని అఖిల్ తో పాటు అతని తండ్రి నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘లెనిన్’. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీని జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ డైరెక్టర్. సితారా ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
హిట్ కోసం
ఓ హిట్ కోసం అక్కినేని అఖిల్ తో పాటు భాగ్యశ్రీ బోర్సే కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తోంది. తెలుగులో ఈ భామ ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ.. కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల్లో నటించింది. ఈ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయాయి.