...
...
Next Story

ఆ వయసులో గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు.. వైభవ్ సూర్యవంశీ ఆటకు అమితాబ్ ఫిదా

ఐపీఎల్ 2026 సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు అతడిపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ కుర్రాడిపై బిగ్‌బి ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

Published on: May 30, 2026, 14:24:17 IST
Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్శించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్.. సీనియర్ బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీపై అమితాబ్ ప్రశంసలు
వైభవ్ సూర్యవంశీపై అమితాబ్ ప్రశంసలు

వైభవ్ సంచలన ఆటతీరు చూసి యావత్ దేశం ముక్కున ఆశ్చర్యపోతోంది. క్రికెట్ దిగ్గజాల నుండి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ యువ సంచలనాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

బాలీవుడ్ లెజెండ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ వైభవ్ ఆటపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు, స్కూల్లో కనీసం గోల్ కీపర్‌గా కూడా సరిగ్గా ఆడటం చేతకాని పరిస్థితి. గోళిలు, గల్లీ క్రికెట్ కూడా సరిగా ఆడలేకపోయేవాళ్లం. కానీ ఈ చిన్న వయసులోనే నువ్ అద్భుతాలు సృష్టిస్తున్నావ్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్‌లో ఇంత అద్భుతంగా ఆడుతున్నావ్.' అంటూ ఆశీస్సులు అందించారు అమితాబ్ బచ్చన.

కేవలం అమితాబ్ మాత్రమే కాదు, 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్ సైతం వైభవ్ క్లాసిక్ బ్యాటింగ్ శైలిని, అతనికున్న టైమింగ్‌ను ఎక్స్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వైభవ్ కీలక ప్లేయర్‌గా మారాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరుతో యావత్ దేశం ఫిదా అయిపోయింది.

మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించడం, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడం.. రాజస్థాన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి, క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర బ్యాటింగ్‌కు (214 పరుగులు) గట్టి పోటీ ఇచ్చి టోర్నమెంట్‌లో మూడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు ఈ స్థాయికి చేరడం వెనుక వైభవ్ పోరాటం దాగుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe