Bigg Boss 10: బుల్లితెరపై సంచలనంగా మారిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లోనే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ఈ షో లాంఛ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఎండింగ్ కు చేరుకుంది.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సర్ ప్రైజ్

కామనర్లకు బిగ్ బాస్ ఎంట్రీ కల్పించేందుకు నిర్వహిస్తున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్ కు వచ్చేసింది. తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ఈ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే కోసం మేకర్స్ ఓ భారీ సర్ ప్రైజ్ ను ప్రకటించారు. అదే గోల్డెన్ టికెట్. అది పొందిన వాళ్లు డైరెక్ట్ గా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.
కామనర్లు షాక్
అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్లో మొత్తం 13 మంది పోటీపడుతున్నారు. ఈ ఫినాలే ఎపిసోడ్ లో గోల్డెన్ టికెట్ గురించి యాంకర్ శ్రీముఖి చెప్పగానే కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని టాస్క్ బరిలోకి దూకేశారు. ఈ 13 మందికి టాస్క్ లు పెడుతున్నారు మేకర్స్. ఇందులో గెలిచిన వాళ్లు డైరెక్ట్ గా గోల్డెన్ టికెట్ తో బిగ్ బాస్ 10కు వెళ్లిపోతారు.
గోల్డెన్ టికెట్ ఆమెకేనా?
అయితే ఇప్పటికే కామనర్ల నుంచి సింగర్ ఝాన్సీకి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ బెర్త్ కన్ఫామ్ అయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అగ్నిపరీక్షలో ఆట, మాటల్లో ఝాన్సీ అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆమె హౌస్ లోకి అడుగుపెట్టడం ఖాయమంటున్నారు. మరి ఈ గోల్డెన్ టికెట్ గెలుచుకొని ఝాన్సీ డైరెక్ట్ గా హౌస్ కు సెలెక్ట్ అవుతుందేమో చూడాలి.
గ్రాండ్ లాంఛ్
{{/usCountry}}అయితే ఇప్పటికే కామనర్ల నుంచి సింగర్ ఝాన్సీకి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ బెర్త్ కన్ఫామ్ అయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ అగ్నిపరీక్షలో ఆట, మాటల్లో ఝాన్సీ అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆమె హౌస్ లోకి అడుగుపెట్టడం ఖాయమంటున్నారు. మరి ఈ గోల్డెన్ టికెట్ గెలుచుకొని ఝాన్సీ డైరెక్ట్ గా హౌస్ కు సెలెక్ట్ అవుతుందేమో చూడాలి.
గ్రాండ్ లాంఛ్
{{/usCountry}}మైల్ స్టోన్ లాంటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘దశావతారం’ కాన్సెప్ట్ తో ఈ సారి సీజన్ ను డిఫరెంట్ గా కొనసాగించనున్నారని టాక్. మరోసారి బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కింగ్ అక్కినేని నాగార్జున అలరించేందుకు రెడీ అవుతున్నారు.
కంటెస్టెంట్స్
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ పై రోజుకో ప్రచారం సాగుతోంది. జబర్దస్త్ ఆటో రాంప్రసాద్, నరేష్, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, సీరియల్ యాక్టర్లు ముఖేష్, చైత్ర రాయ్, దేబ్జానీ, టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ తదితరులు బిగ్ బాస్ లోకి అడుగుపెడతారనే టాక్ వినిపిస్తోంది.