...
...
Next Story

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. రోహిత్ వార్నింగ్.. ఈ వారం ఆ మోడల్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా?

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో పోరు మరింత ఇంటెన్సివ్ గా మారింది. కెప్టెన్సీ రేసు కోసం కంటెస్టెంట్లు ఫిజికల్ గా పోరాడుతున్నారు. బిగ్ బాస్ పెట్టే టాస్కుల కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతుందనే చెప్పాలి.

Published on: Sep 30, 2026, 13:51:33 IST
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఈ వారం ఆట రచ్చరచ్చగా మారుతోంది. టోటల్ డామినేషన్ థీమ్ తో ఈ వీక్ ఆట జోరందుకుంది. కెప్టెన్సీ రేసులో కంటెస్టెంట్లు ఆడ, మగ అని తేడా లేకుండా పోరాడుతున్నారు. కొన్నిసార్లు ఫిజికల్ కూడా అవుతున్నారు. దీంతో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ పై హైప్ కాస్త పెరిగిందనే టాక్ ఉంది.

బిగ్ బాస్ 10 తెలుగులో రచ్చ

: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. రోహిత్ వార్నింగ్.. ఈ వారం ఆ మోడల్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? (youtube/starmaa)
: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. రోహిత్ వార్నింగ్.. ఈ వారం ఆ మోడల్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? (youtube/starmaa)

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారంలో కంటెస్టెంట్ల మధ్య ఫైట్ మరింత జోరందుకుంది. బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్లను రెండు టీమ్ లుగా విడదీశాడు. టీమ్ భైరవ, టీమ్ సప్తశక్తిగా కంటెస్టెంట్లు డివైడ్ అయ్యారు. ఈ టీమ్స్ ఇప్పుడు ఫైట్ చేసుకుంటున్నాయి.

రోహిత్ వార్నింగ్

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు త్రిగుణ్ వర్సెస్ రోహిత్, అమన్, అపూర్వగా వార్ మారింది. ఈ ముగ్గురు ప్రత్యేకంగా త్రిగుణ్ ను టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక టాస్క్ లో భాగంగా ఫిజికల్ అయితే మాత్రం తాను లాగిపడేస్తానంటూ రోహిత్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

ఇప్పుడు భైరవ టీమ్ లో అపూర్వ, రోహిత్, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, రాంప్రసాద్, వంశీ ఉన్నారు. సప్తశక్తి టీమ్ లోనేమో త్రిగుణ్, దేబ్జానీ, శాలిని, సృష్టి, చరణ్, నరేష్, ముఖేష్ గౌడ ఉన్నారు.

బిగ్ బాస్ ఓటింగ్

ఇక బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో నాలుగో వారం 9 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. త్రిగుణ్, ముఖేష్, రోహిత్, శాలిని, చరణ్, నరేష్, దేబ్జానీ, అమన్, సృష్టి నామినేషన్లలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ గమనిస్తే అమన్, సృష్టి డేంజర్ డేన్లో ఉన్నట్లు కనిపిస్తోంది.

లాస్ట్ లో సృష్టి

హీరో త్రిగుణ్, రోహిత్ మధ్య ఓటింగ్ వార్ కొనసాగుతోంది. వీళ్లిద్దరూ టాప్ ప్లేసు కోసం ఫైట్ చేస్తున్నారు. కొద్ది తేడాతోనే వీళ్ల టాప్ 2 స్థానాలు మారుతూనే ఉన్నాయని తెలిసింది. మరి వీకెండ్ వరకు ఏం జరుగుతుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks