Bigg Boss 10 Elimination: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో మోడల్ సృష్టి వ్యాకరణం జర్నీ ముగిసిందని తెలిసింది. ఈ భామ నాలుగో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని సమాచారం. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సృష్టి వ్యాకరణం.. అగ్నిపరీక్షలో సత్తాచాటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో అడుగుపెట్టింది.
బిగ్ బాస్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నాలుగో వారంలో ఎలిమినేషన్ ట్విస్ట్ చోటు చేసుకుందని తెలిసింది. జనాల ఓటింగ్ ఆధారంగా సృష్టి వ్యాకరణం హౌస్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఈ వారం ఓటింగ్ అంతా తారుమారు అవుతూ వచ్చిందనే టాక్ ఉంది. ఫస్ట్ సృష్టి వ్యాకరణం, ఆ తర్వాత దేబ్జానీ, అమన్ డేంజర్ జోన్లో ఉన్నారు.
కానీ ఇప్పడు చివరకు వచ్చేసరికి సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిందని తెలిసింది. జనాలు ఆమెకు ఓట్లు వేయలేదని టాక్. దీంతో సృష్టి వ్యాకరణం హౌస్ నుంచి వెళ్లిపోక తప్పలేదు.
సుధీర్ తో గొడవ
కామనర్ గా అగ్నిపరీక్ష సీజన్ 2లో సృష్టి వ్యాకరణం పోటీ పడింది. అక్కడ సత్తాచాటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు ఎంపికైంది. హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్లో ఆడింది. అయితే సెకండ్ వీక్ అంతా సృష్టి వ్యాకరణం ఆట డల్ గానే సాగింది. దీంతో వీకెండ్ లో పక్కన కూర్చోబెట్టి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఆ తర్వాత మూడో వీక్ నామినేషన్లో సృష్టి వ్యాకరణం రెచ్చిపోయింది. సుధీర్ అంటే సృష్టి అనేలా కామెంట్లు రావడంతో ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. సుధీర్ ను నానా మాటలు అన్నది. గుద్దితే పళ్లు రాలిపోతాయని ఆవేశంతో ఊగిపోయింది. ఈ గొడవ సృష్టికి చేటు చేసిందనే టాక్ ఉంది.
రెమ్యునరేషన్ ఎంతంటే?
{{/usCountry}}ఆ తర్వాత మూడో వీక్ నామినేషన్లో సృష్టి వ్యాకరణం రెచ్చిపోయింది. సుధీర్ అంటే సృష్టి అనేలా కామెంట్లు రావడంతో ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. సుధీర్ ను నానా మాటలు అన్నది. గుద్దితే పళ్లు రాలిపోతాయని ఆవేశంతో ఊగిపోయింది. ఈ గొడవ సృష్టికి చేటు చేసిందనే టాక్ ఉంది.
రెమ్యునరేషన్ ఎంతంటే?
{{/usCountry}}బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సృష్టి వ్యాకరణం నాలుగు వారాలు ఉంది. అంతకుముందు అగ్నిపరీక్షలో పోటీపడింది. అగ్నిపరీక్ష నుంచి ఆమెకు రూ.50 వేలు వచ్చాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో వారానికి రూ.75 వేల చొప్పున ఆమెకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని తెలిసింది.
అంటే నాలుగు వారాలకు కలిపి బిగ్ బాస్ నుంచి సృష్టి వ్యాకరణం రూ.3 లక్షలు సంపాదించిందన్నమాట. ఇక అగ్నిపరీక్ష కూడా కలుపుకొంటే మరో రూ.50 వేలు అదనంగా ఖాతాలో చేరాయని చెప్పొచ్చు.