యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అనురాగ్ దోభాల్ (UK07 Rider) షేర్ చేసిన ఒక సుదీర్ఘ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. గత కొన్ని రోజులుగా తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను వివరిస్తూ, తన కుటుంబ సభ్యులపైనే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీనిని తన 'చివరి వీడియో'గా పేర్కొంటూ అనురాగ్ దోభాల్ కన్నీటి పర్యంతమయ్యారు.
బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడటం నుంచి

సుమారు రెండు గంటల నిడివి ఉన్న ఈ వీడియోలో అనురాగ్ తన జీవితంలోని కఠిన దశలను గుర్తు చేసుకున్నారు. 14 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడటం నుంచి, కుటుంబం నుంచి ఎదురైన ఒత్తిడి వరకు అన్నింటినీ బయటపెట్టారు అనురాగ్ దోభాల్. ముఖ్యంగా తన వివాహం విషయంలో తల్లిదండ్రులు ప్రవర్తించిన తీరు తనను కృంగదీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబమే నరకం చూపించింది!
"నా జీవితం ఇంత దారుణంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నా పెళ్లికి కేవలం ఆరు రోజుల ముందు మా అమ్మనాన్నలు రామని మొండికేశారు. అందరి ముందు నాతో కాళ్లు పట్టించుకున్నారు, క్షమాపణలు చెప్పించుకున్నారు. 'మేము సంతోషంగా ఉండం.. నిన్ను ఉండనివ్వం' అంటూ చిత్రహింసలు పెట్టారు" అని అనురాగ్ కన్నీరు పెట్టుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తనను, తన భార్య రితికను ఇంట్లోకి రానివ్వలేదని అనురాగ్ దోభాల్ ఆరోపించారు.
ఆస్తి కోసం తమ్ముడి వేధింపులు
తన తమ్ముడు కలాం తనను సోషల్ మీడియాలో బద్నాం చేస్తానని బెదిరించి, తన ఆస్తులను, చివరకు తన పెంపుడు కుక్కలను కూడా లాక్కున్నాడని అనురాగ్ దోభాల్ ఆరోపించారు.
నా చావుకు అమ్మ నాన్నే కారణం
"నా చావుకు మా అమ్మ, నాన్న, తమ్ముడు కలాం, శ్రేయలే కారణం. నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఐదు రోజులుగా అన్నం తినలేదు. ఈ వీడియో తర్వాత నేను మీకు కనిపించకపోవచ్చు. నేను కేవలం ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాను" అంటూ అనురాగ్ దోభాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
భార్య కూడా దూరం!
{{/usCountry}}"నా చావుకు మా అమ్మ, నాన్న, తమ్ముడు కలాం, శ్రేయలే కారణం. నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఐదు రోజులుగా అన్నం తినలేదు. ఈ వీడియో తర్వాత నేను మీకు కనిపించకపోవచ్చు. నేను కేవలం ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాను" అంటూ అనురాగ్ దోభాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
భార్య కూడా దూరం!
{{/usCountry}}మరోవైపు తన భార్య రితిక కూడా తనను వదిలి వెళ్లిపోయిందని అనురాగ్ దోభాల్ తెలిపారు. "రితికా.. నిన్ను చాలామంది తప్పుదారి పట్టించారు. నువ్వు ఇతరులను నమ్మి నన్ను ఒంటరిని చేశావు. మన బిడ్డ కోసమైనా నువ్వు నిలబడతావని కోరుకుంటున్నాను" అని అనురాగ్ ఎమోషనల్ అయ్యారు.
గత ఏడాది వివాహం.. త్వరలో తండ్రి కాబోతుండగా..
అనురాగ్ దోభాల్ తన చిరకాల ప్రేయసి రితికను గతేడాది మే నెలలో వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సంతోషంగా ప్రకటించారు. కానీ, అంతలోనే జీవితం తలకిందులైందని, తనకిక ఏ దారీ కనిపించడం లేదని అనురాగ్ పేర్కొన్నారు.
చివరి యూట్యూబ్ వ్లాగ్
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనురాగ్ క్షేమంగా ఉండాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.
కులాంతర వివాహమే కారణం
కులాంతర వివాహంతో తన తల్లిదండ్రులే చిత్రహింసలు గురి చేశారని, చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కూడా వదిలిపోయిందని, సూసైడ్ తప్పా ఇంకో దారి లేదని, అదే తనకు చివరి యూట్యూబ్ వ్లాగ్ అని ఆ వీడియోలో అనురాగ్ దోభాల్ చెప్పడం అందరిని కలిచివేస్తుంది.