హిందీ బిగ్ బాస్ 17 ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ దోభాల్ (యూకే07 రైడర్) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ఆయన కారును డివైడర్‌కు బలంగా ఢీకొట్టారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించిన అనురాగ్ కారను సుమారు 140-150 కిలోమీటర్ల వేగంతో నడిపారు.
ఆసుపత్రి బెడ్ పై అనురాగ్.. పరిస్థితి విషమం!

ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనురాగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మార్చి 9న అనురాగ్ దోభాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యూట్యూబర్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా ఫోటోను షేర్ చేశారు. ఆసుపత్రి బెడ్‌పై అపస్మారక స్థితిలో ఉన్న అనురాగ్, తన స్నేహితుడి చేతిని పట్టుకుని ఉన్న దృశ్యం అభిమానులను కలిచివేస్తోంది.
కోలుకోవాలని ప్రార్థించండి
"అనురాగ్ ప్రాణాల కోసం పోరాడుతున్నారు.. ఆయన కోలుకోవాలని ప్రార్థించండి" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అనురాగ్ దోభాల్ భార్య రితికా చౌహాన్, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
హేటర్లపై మేనేజర్ ఆగ్రహం
అనురాగ్ దోభాల్ మేనేజర్ రోహిత్ పాండే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ అనురాగ్ గురించి పట్టించుకోని వారు, ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఆయన మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రార్థనలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు
"అనురాగ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ అండగా నిలవలేదు. ఇప్పుడు మాత్రం అందరూ ప్రార్థనలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు" అని రోహిత్ పాండే ఘాటుగా విమర్శించారు. అనవసర పుకార్లను నమ్మవద్దని, ఈ సమయంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ఆయన కోరారు.
ప్రమాదానికి ముందు మానసిక వేదన?
రోడ్డు ప్రమాదానికి కొద్దిసేపటి ముందు అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కనిపిస్తూ.. తాను చాలా ఒంటరినైపోయానని, ఫోన్ చేయడానికి కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన తన టయోటా ఫార్చ్యూనర్ కారును 140-150 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ కనిపించారు.
మానసిక వేధింపులు
{{/usCountry}}రోడ్డు ప్రమాదానికి కొద్దిసేపటి ముందు అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కనిపిస్తూ.. తాను చాలా ఒంటరినైపోయానని, ఫోన్ చేయడానికి కూడా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన తన టయోటా ఫార్చ్యూనర్ కారును 140-150 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ కనిపించారు.
మానసిక వేధింపులు
{{/usCountry}}గత కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి మానసిక వేధింపులు, చిత్రహింసలు ఎదుర్కొంటున్నానని అనురాగ్ దోభాల్ ఇదే సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
ఒంటరిగా బతలేకపోతున్నానంటూ
అదంతా కులాంతర వివాహం చేసుకున్నందుకే అని, తన భార్య రితికాను కూడా రానివ్వడం లేదని, ఇదే చివరి వీడియో అంటూ విడుదల చేయడం అభిమానులను విస్మయానికి గురి చేసింది. అంతేకాకుండా తన భార్య తనను విడిచిపెట్టి పోయిందని, ఒంటరిగా బతకలేకపోతున్నట్లుగా అందులో చెప్పారు యూట్యూబర్, బిగ్ బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభాల్.