Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో ఊహించని ఎలిమినేషన్- వచ్చిన 24 గంటల్లోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అవుట్- ఏమైందంటే?
Bigg Boss 20 Nakul Dhull Elimination In 24 Hours: బిగ్ బాస్‌లో తాజాగా షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ నయా సీజన్ 20లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నకుల్ ధుల్ కేవలం 24 గంటల్లోనే ఎలిమినేట్ అయి ఇంటి నుంచి అవుట్ అయ్యాడు. మరి నకుల్ ధుల్ ఎలిమినేషన్‌కు కారణం ఏంటో తెలుసుకుందాం.
Bigg Boss Wild Card Contestant Elimination In 24 Hours: రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో డ్రామా, గొడవలు సర్వసాధారణం. అయితే హౌస్‌లోకి అడుగుపెట్టిన రోజే భౌతిక దాడికి దిగి ఎలిమినేట్ కావడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిదే తాజాగా బిగ్ బాస్ రియాలిటీ ఓటీటీ షోలో జరిగింది.

24 గంటల్లోనే ఎలిమినేషన్
ప్రసిద్ధ హిందీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 20'లో ఈ సంచలన ఘటనే చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా భారీ అంచనాలతో హౌస్‌లోకి వెళ్లిన కంటెంట్ క్రియేటర్ నకుల్ ధుల్ అడుగుపెట్టిన 24 గంటలు కూడా గడవకముందే ఎలిమినేషన్ ఎదుర్కొని ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
అసలు హౌస్‌లో ఏం జరిగింది?
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 20వ సీజన్‌లో నిర్వాహకులు ఇటీవల 'తథాస్తు-2' పేరుతో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఒకేసారి ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపుతున్నట్లు ప్రకటించారు. ముందుగా మనీష్ గోయెల్ హౌస్‌లోకి వెళ్లగా, ఆయన వెనుకే నకుల్ ధుల్ అడుగుపెట్టారు.
హరియాణాకు చెందిన నకుల్ రాకతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది. హౌస్‌లోకి వెళ్లిన కొద్ది గంటల్లోనే నకుల్, తోటి కంటెస్టెంట్ గుల్లూ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి ఇద్దరి మధ్య గొడవ మరింత ఎక్కువైంది.
రాత్రి సమయంలో జరిగిన ఈ వివాదంలో నియంత్రణ కోల్పోయిన నకుల్ ధుల్, గుల్లూపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం, ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, భౌతిక దాడి జరిగింది. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం హౌస్‌లో ఎంతటి తీవ్రమైన గొడవలు జరిగినా సరే, ఎవరిని కొట్టడం, మరేవిధంగా అయిన గాయపరచడానికి వీల్లేదు.
పునీత్ సూపర్ స్టార్ రికార్డు సమం!
ఈ నిబంధనను ఉల్లంఘించడంతో బిగ్ బాస్ నకుల్‌ను తక్షణమే షో నుంచి నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేసి పంపించివేశారు. బిగ్ బాస్ చరిత్రలో ఇలా 24 గంటల్లోనే కంటెస్టెంట్ బయటకు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 'పునీత్ సూపర్ స్టార్' కూడా హౌస్‌లోకి వచ్చిన ఒక్క రోజులోనే ఎలిమినేట్ అయి వార్తల్లో నిలిచారు.
ఇప్పుడు నకుల్ ధుల్ కూడా అదే బాటలో పయనించి ఆ రికార్డును సమం చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నకుల్ ధుల్ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్. గతంలో రజత్ దలాల్‌కు మద్దతుగా మాట్లాడటం, మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచారు.
నెటిజన్ల రియాక్షన్.. సీక్రెట్ రూమ్ పుకార్లకు చెక్
హరియాణా ఆడియెన్స్‌లో ఆయనకు మంచి క్రేజ్ ఉండటంతో బిగ్ బాస్ నిర్వాహకులు హౌస్‌లోకి నకుల్ ధుల్‌ని తీసుకొచ్చారు. కానీ, కోపాన్ని అదుపులో ఉంచుకోలేక తొలి రోజే షో నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నకుల్ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
నకుల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించారా అని కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయగా, ప్రముఖ బిగ్ బాస్ ట్రాకింగ్ పేజ్ 'బిగ్ బాస్ తక్' ఆ వార్తలను ఖండించింది. ఆయనను పూర్తిగా షో నుంచే బయటకు పంపినట్లు స్పష్టం చేసింది. నియమాలు అందరికీ ఒక్కటేనని, భౌతిక దాడికి దిగిన వారిపై బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకోవడం సరైన నిర్ణయమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


