...
...
Next Story

బిగ్ బాస్ 9లో టాప్-5 కాదు 6.. ఫినాలే వీక్ కు ఆరుగురు కంటెస్టెంట్లు.. ఎలిమినేట్ అయిన రీతుకు బంపరాఫర్?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో లాస్ట్ వీక్ కు ముందు మరో ట్విస్ట్ చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఫినాలే వీక్ కు టాప్-5 కాకుండా టాప్-6 కంటెస్టెంట్లను తీసుకుంటారని సమాచారం. మరోవైపు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రీతుకు బంపరాఫర్ వచ్చిందని టాక్.

Published on: Dec 8, 2025, 13:53:25 IST
Advertisement

ఇది చదరంగం కాదు రణరంగమంటూ స్టార్ట్ అయిన బిగ్ బాస్ 9 సీజన్ ముగింపుకు చేరువవుతోంది. ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఫినాలే వీక్ కు ముందు కూడా బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే బిగ్ బాస్ ఫినాలే వారానికి అయిదుగురు కంటెస్టెంట్లు అర్హత సాధిస్తారు. కానీ బిగ్ బాస్ 9లో మాత్రం ఓ ట్విస్ట్ ఉండబోతుంది.

బిగ్ బాస్ 9 టాప్ 6

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

అవును.. మీరు చదివింది నిజమేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సారి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో టాప్-5 కాదు టాప్-6 ఉండబోతున్నారని తెలిసింది. అంటే సీజన్ 6 లాగే సీజన్ 9లోనూ ఫినాలే వీక్ కు ఆరుగురు కంటెస్టెంట్లకు ఛాన్స్ ఇస్తారని టాక్. అయితే ఈ ఆరుగురిలో ఒకరిని వచ్చే వారం మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. అప్పుడు గ్రాండ్ ఫినాలేకు అయిదుగురు కంటెస్టెంట్లే ఉంటారు.

ఒకరు ఔట్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పడాల కల్యాణ్ ఇప్పటికే ఫైనల్ టికెట్ సంపాదించాడు. ఇక తనూజ, ఇమ్మాన్యుయేల్ ఫైనల్ చేరడం ఖాయమే.

ఇక మిగిలింది డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన గల్రానీ. ఇందులో ఈ వారం సుమన్ శెట్టి లేదా సంజన గల్రానీ ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఫినాలే వీక్ కు కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, భరణితో పాటు సంజన లేదా సుమన్ లో ఒకరు అర్హత సాధించొచ్చు.

రీతుకు బంపరాఫర్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks