వార్ వ‌న్‌సైడ్‌.. బిగ్ బాస్ టైటిల్‌కు చేరువ‌లో సైనికుడు.. ఓటింగ్‌లో దుమ్ము రేపుతున్న క‌ల్యాణ్‌!

బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ వేటలో వార్ వన్ సైడ్ లాగే అనిపిస్తోంది. ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ కు ఓటింగ్ లో తిరుగేలేదు. జనాల ఆదరణతో అతను దూసుకెళ్తున్నాడు.

Dec 17, 2025, 13:46:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో విన్నర్ ఎవరో ఓ క్లారిటీ వచ్చేసినట్లే ఉంది. ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్ చూస్తే ఇది ఖాయమనిపిస్తోంది. ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తాడనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. జనాలు అతనికి తమ ఓట్లతో మద్దతు తెలియజేస్తున్నారు. కల్యాణ్ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు.

పడాల కల్యాణ్ (jiohotstar)
పడాల కల్యాణ్ (jiohotstar)

బిగ్ బాస్ టాప్-5

బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ కు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు ముందు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే హౌస్ లో టాప్-5 కంటెస్టెంట్లు ఉన్నారు. పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన గల్రానీ ఫైనల్ కు అర్హత సాధించారు. వీళ్లలో నుంచి ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ ఒకరు ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

విన్నర్ గా కల్యాణ్!

బిగ్ బాస్ తెలుగులో ఈ సీజన్ ను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లలో చాలా మంది మాట.. విన్నర్ కల్యాణ్. అవును.. ఇప్పుడు ఎక్కువ మంది నుంచి ఇదే వినిపిస్తోంది. కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టిన సైనికుడు కల్యాణ్ మొదటి నుంచి అదరగొడుతూ వచ్చాడు. అటు టాస్క్ ల్లో, ఇటు క్యారెక్టర్ పరంగా బెస్ట్ గా నిలిచి ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు.

బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్

బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ లో వార్ వన్ సైడ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పడాల కల్యాణ్ కు పడుతున్న ఓట్లే. ప్రస్తుతం ఓటింగ్ లో కల్యాణ్ టాప్ లో దూసుకుపోతున్నట్లు తెలిసింది. అతనికి ఇప్పుడు 42.19 శాతం ఓట్లున్నాయని అంటున్నారు. ఈ ఓట్లతో అతను నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.

తనూజ ఇలా

ఇక టైటిల్ రేసులో ప్రధాన పోటీదారులు అనుకుంటున్న తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్ ఓటింగ్ లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పవన్ కు తనూజ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆమె ఖాతాలో ప్రస్తుతం 30.34 శాతం ఓటింగ్ ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఏమైనా ట్రెండ్ మారితే తనూజ లీడ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే అయితే ఇమ్మాన్యుయెల్ 12.18 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రకంగా అతను టైటిల్ కొట్టడమే కష్టమే అనిపిస్తోంది. కానీ బిగ్ బాస్ ఫినాలేలో ఏం చేస్తాడో తెలియదు. అనూహ్యంగా ఇమ్ము కప్ దక్కించుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక డీమాన్ పవన్ (10.57 శాతం), సంజన గల్రానీ (4.71 శాతం) టైటిల్ ఆశలు వదులుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More