...
...
Next Story

బిగ్ బాస్ నుంచి రెండోసారి భరణి శంకర్ ఎలిమినేట్- రీ ఎంట్రీ, అధికంగా రెమ్యూనరేషన్- సీరియల్ విలన్ 12 వారాల సంపాదన ఎంతంటే?

బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిపోయింది. శనివారం ఎపిసోడ్‌లో మొదగా కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా ఆదివారం (డిసెంబర్ 14) ఎపిసోడ్‌లో భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, భరణి ఎలిమినేట్ అవడం ఇది రెండోసారి. మరి మొత్తంగా 12 వారాలు ఉన్న భరణి రెమ్యూనరేషన్ ఎంతో చూద్దాం.

Published on: Dec 15, 2025 05:33 AM IST
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌కు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. మహా అయితే ఇంకో వారంలో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో నుంచి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కింద ఇద్దరు ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.

సుమన్ శెట్టి ఎలిమినేట్

బిగ్ బాస్ నుంచి రెండోసారి భరణి శంకర్ ఎలిమినేట్- రీ ఎంట్రీ, అధికంగా రెమ్యూనరేషన్- సీరియల్ విలన్ 12 వారాల సంపాదన ఎంతంటే?
బిగ్ బాస్ నుంచి రెండోసారి భరణి శంకర్ ఎలిమినేట్- రీ ఎంట్రీ, అధికంగా రెమ్యూనరేషన్- సీరియల్ విలన్ 12 వారాల సంపాదన ఎంతంటే?

అంటే, బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. మొదటగా శనివారం (డిసెంబర్ 13) నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం (డిసెంబర్ 14) నాటి ఎపిసోడ్‌లో భరణి శంకర్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు.

అయితే, భరణి శంకర్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవడం ఇది రెండోసారి. ఇదివరకు 6వ వారంలో బిగ్ బాస్ తెలుగు 9 నుంచి భరణి శంకర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు భరణికి ఉన్న క్రేజ్, సోషల్ మీడియాలో బీబీ టీమ్‌పై వ్యతిరేకత వచ్చింది. దాంతో మళ్లీ బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు భరణి శంకర్.

8వ వారంలో రీ ఎంట్రీ

బిగ్ బాస్ తెలుగు 9 ఎనిమిదో వారంలో భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన అంతగా ఆకట్టుకోలేదు. దివ్యతో ఫ్రెండ్‌షిప్ కారణంగా అరుపులు, అనవసరపు వాగ్వాదాలు తప్ప పెద్ద చేసింది లేదు. దివ్య నిఖిత ఎలిమినేషన్ తర్వాత భరణి శంకర్ ఆటలో వేగం అందుకుంది. అప్పుడు అసలైన భరణి ఏంటో తెలిసింది.

ఈ నేపథ్యంలో భరణి శంకర్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్‌పై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ అందరికంటే భరణి శంకర్ పారితోషికం ఎక్కువగా ఉందని టాక్ నడుస్తోంది. భరణి బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు రోజుకు రూ. 50 వేలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే, వారానికి రూ. 3 లక్షల 50 వేలు.

భరణి శంకర్ సంపాదన

ఈ లెక్కన మొదటి ఆరు వారాల్లో రూ. 21 లక్షలు సంపాదించిన సీరియల్ విలన్ భరణి శంకర్ ఆ తర్వాత 8వ వారం నుంచి కంటిన్యూ అయ్యాడు. 8వ వారం నుంచి 14వ వారానికి మధ్య ఆరు వారాలు ఉన్నాయి. మొదటి 6 వారాలు, రీ ఎంట్రీ ఆరు వారాలు కలుపుకుని మొత్తంగా 12 వారాలు బిగ్ బాస్ హౌజ్‌లో భరణి శంకర్ ఉన్నాడు.

ఈ లెక్కన సుమారుగా రూ. 42 లక్షలను బిగ్ బాస్ ద్వారా భరణి శంకర్ సంపాదించినట్లు తెలుస్తోంది. ఇది సుమారుగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌ మనీకి దగ్గరిగా ఉంది. ఇలా అందరికంటే అధికంగా రెమ్యూనరేషన్‌ను బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో టీవీ సీరియల్ నటుడు భరణి శంకర్ అందుకున్నట్లు సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe