బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 9లో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఎలిమినేట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారని తెలిసిందే. అలానే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి దివ్వెల మాధురి హాజరు అయింది.
అంత గొడవ ఉండేది కాదుగా

"మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మాధురినా మాధవినా" అని శివాజీ అడిగాడు. "నా పేరు మాధురి మాధవి కాదు" అని ఆమె బదులిచ్చింది. "ఇదే ఆరోజు చెబితే అంత గొడవ ఉండేది కాదుగా ఆ అమ్మాయితో" అని శివాజీ పంచ్ ఇచ్చాడు. "అందరికి అలా చెప్పను. నాకు నచ్చితే చెబుతాను" అని శివాజీకే రివర్స్ పంచ్ ఇచ్చింది దివ్వెల మాధురి.
"హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుగు ఇళ్లలోకి రావాలనుకున్నారు" అని శివాజీ అంటే "వెళ్లాను" అని మాధురి అంది. "వెళ్తే ఇంత త్వరగా ఎందుకు వస్తారు" అని శివాజీ అంటే.. "నేను రావాలని అనుకున్నాను కాబట్టే వచ్చాను" అని మాధురి బదులిచ్చింది. దానికి శివాజీ షాక్ అయిపోయాడు.
మీరు తోపు అనట్లేదు
"నాకు యాక్టింగ్ రాదు. మాస్కులు లేనేలేవు. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా" అని మాధురు చెప్తుంటే "ఇది ఎవరు అడగలేదే" అని శివాజీ పంచ్ ఇచ్చాడు. "బిగ్ బాస్‌లో ఎంత పెద్ద తోపు ఉన్నా సరే" అని శివాజీ చెబుతుంటే "ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు. నేను తోపు అనుకోవట్లేదు" అని మధ్యలో మాధురి అంది. "మీ గురించి అనట్లేదు. మీరు తోపు అనలేదుగా" అని మళ్లీ పంచ్ ఇచ్చాడు శివాజీ.
"బయట ఏంటీ జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతారా. ఎలా కొడతారండి. ఈ విధంగా మాట్లాడితే ఆడియెన్స్ ఉండనిస్తారా" అని శివాజీ అన్నాడు. "ఆడియెన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి అంటే" అని మాధురి చెబుతుంటే.. "మీరు అందుకే వచ్చారు కదా" అని శివాజీ అన్నాడు.
ఆ మాట తప్పా
{{/usCountry}}"బయట ఏంటీ జుట్టు పట్టుకుని ఈడ్చి కొడతారా. ఎలా కొడతారండి. ఈ విధంగా మాట్లాడితే ఆడియెన్స్ ఉండనిస్తారా" అని శివాజీ అన్నాడు. "ఆడియెన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి అంటే" అని మాధురి చెబుతుంటే.. "మీరు అందుకే వచ్చారు కదా" అని శివాజీ అన్నాడు.
ఆ మాట తప్పా
{{/usCountry}}"నేను వెళ్లాలి అనుకున్నాను వెళ్లాను.. రావాలి అనుకున్నాను వచ్చాను" అని మాధురి అంది. "ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయాను అంటే ఎలాగండి" అని శివాజీ సెటైర్ వేశాడు. దాంతో సైలెంట్ అయిపోయింది మాధురి. "కూర్చోండి అంటే కూర్చోకపోతే మాట్లాడరా" అనే దాని గురించి శివాజీ అడిగాడు.
"కూర్చోకపోతే మాట్లాడరా అనే మాట తప్పా" అని ఎక్కడా తగ్గకుండా మాధురి సమాధానం ఇచ్చింది. దానికి శివాజీ షాక్ అయ్యాడు. "మీరు హౌజ్‌లో కూర్చుని చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్ టెర్రిఫిక్‌గా ఉంది" అని శివాజీ చెబుతుంటే.. "మీకా" అని పంచ్ ఇచ్చింది మాధురి.
శివాజీకే చుక్కలు
"అమ్మా తల్లే.. నాకు కాదమ్మా. లోపల ఉన్న సాయికి" అని చేతులతో దండం పెట్టి చెప్పాడు శివాజీ. "మీరు ఓ ఫేజ్‌లో భయపడినట్లు అనిపించింది" అని శివాజీ అంటే.. "భయమనేది నా బ్లడ్‌లో లేదండి" అని దివ్వెల మాధురి గట్టిగా ఆన్సర్ ఇచ్చింది. ఇలా వాడివేడిగా జరిగిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హీరో శివాజీకే దివ్వెల మాధురి చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది.