...
...
Next Story

బిగ్ బాస్ ఓటింగ్‌లో దూసుకుపోతున్న సీరియల్ హీరోయిన్- అట్టడుగున పచ్చళ్ల పాప- డేంజర్‌లో ఆ నటుడు- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగిపోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత మరింత ఊపందుకుందు బిగ్ బాస్ తెలుగు 9. అయితే, ఈ వారం నామినేషన్స్‌లో 8 మంది ఉండగా.. వారిలో బిగ్ బాస్ ఓటింగ్‌లో సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి టాప్ 1 ప్లేసులో దూసుకుపోతోంది. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం.

Published on: Oct 22, 2025, 12:10:47 IST
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రంజుగా సాగుతోంది. అరుపులు, గొడవలు, కేకలతో మరింత జోరుగా సాగుతోంది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరింత ఊపందకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 15 మంది వరకు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు నామినేషన్స్ నిర్వహించారు.

బిగ్ బాస్ నామినేషన్స్‌లో 8 మంది

బిగ్ బాస్ ఓటింగ్‌లో దూసుకుపోతున్న సీరియల్ హీరోయిన్- అట్టడుగున పచ్చళ్ల పాప- డేంజర్‌లో ఆ నటుడు- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
బిగ్ బాస్ ఓటింగ్‌లో దూసుకుపోతున్న సీరియల్ హీరోయిన్- అట్టడుగున పచ్చళ్ల పాప- డేంజర్‌లో ఆ నటుడు- ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 9 ఏడో వారం నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, కల్యాణ్ పడాల, రమ్య మోక్ష, సంజన గల్రాని, దివ్య నిఖితా ఉన్నారు. వీరికి నామినేషన్స్ ముగిసిన అనంతరం ఓటింగ్ పోల్స్ ప్రారంభించారు.

బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1

అలా పెట్టిన బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం ఓటింగ్‌లో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి దూసుకుపోతోంది. 36.9 శాతం ఓటింగ్, 16,128 ఓట్లతో తనూజ టాప్ 1 ప్లేసులో దంచికొడుతోంది. ఆమె తర్వాత రెండో స్థానంలో 21.29 శాతం ఓటింగ్ (9,306 ఓట్లు)తో కల్యాణ్ పడాల నిలిచాడు.

ఒక్కొక్కరి ఓటింగ్ శాతాలు, ప్లేసులు

ఇక మూడో ప్లేసులో హీరోయిన్ సంజన గల్రాని 9.99 శాతం ఓటింగ్ (4,365 ఓట్ల)తో ఉంది. వీరి తర్వాత దివ్య నిఖితా 9.95 శాతం ఓటింగ్ (4,347 ఓట్లు)తో నాలుగో స్థానంలో, 7.94 శాతం ఓటింగ్ (3470 ఓట్లు)తో ఐదో ప్లేసులో రాము రాథోడ్, ఆరో స్థానంలో 6.7 శాతం ఓటింగ్ (2,930 ఓట్లు)తో రీతూ చౌదరి ఉన్నారు.

డేంజర్ జోన్‌లో ఇద్దరు

ఇక బిగ్ బాస్ 9 తెలుగు ఏడో వారం ఎలిమినేషన్‌కు దగ్గరిగా సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష ఇద్దరు ఉన్నారు. వీరిలో ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ఓటింగ్‌లో ఏదైనా మార్పులు జరిగితే ఎలిమినేషన్‌లోకి మరొకరు వచ్చి ఇంటి నుంచి అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe