బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో డీమాన్ పవన్, రీతు చౌదరి మధ్య స్పెషల్ బాండ్ ఉందని ఆడియన్స్ అంటున్నారు. రీతు కూడా తన బాండ్ తన ఇష్టమని చెప్పింది. ఈ వారం రీతును పవన్ నామినేట్ చేయడంతో ఏమైనా తేడా కొడుతుందేమో అనిపించింది. కానీ మళ్లీ ఇద్దరు కలిసిపోయారు. ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోకి పవన్ తల్లి వచ్చారు. ఈ సందర్భంగా పవన్, రీతు కెమిస్ట్రీ వైరల్ గా మారింది.
ఫ్యామిలీ వీక్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే డీమాన్ పవన్ తల్లి హౌస్ లోకి చిన్ను అంటూ ఎంట్రీ ఇచ్చారు. అమ్మను చూసి పవన్ ఎమోషనల్ అయ్యాడు. సున్నుండలు తెచ్చి, అందరికీ ఇచ్చారు అమ్మ. కొడుక్కి తన చేత్తో బిర్యానీ తినిపించారు.
పవన్ పెళ్లి
హౌస్ మేట్స్ అందరూ పవన్ అమ్మతో ప్రేమగా మాట్లాడారు. పవన్ పెళ్లి ఎప్పుడు? అని అడిగారు. దీనికి పవన్ కు చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉందని చెప్పడంతో అందరూ నవ్వేశారు. అప్పుడు రీతు సిగ్గుపడటం వైరల్ గా మారింది. ఆమె వెళ్లేటప్పుడు రీతును హగ్ చేసుకుని వెళ్లారు.
బిగ్ బాస్ 9 ఓటింగ్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదకొండో వారంలో ఓటింగ్ ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సారి తనూజ నామినేషన్లలో లేదు. ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, భరణి, డీమాన్ పవన్, సంజన గల్రానీ, దివ్య నిఖిత నామినేట్ అయ్యారు. ఇందులో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు.
టాప్ లో కల్యాణ్
సాధారణంగా అయితే ఇమ్మాన్యుయేల్ గేమ్ పరంగా, ఎంటర్ టైన్మెంట్ పరంగా అదరగొడుతున్నాడు. అతను కొన్ని వారాల తర్వాత నామినేషన్లలోకి వచ్చాడు. దీంతో ఓటింగ్ లో అతనే టాప్ లో ఉంటాడనిపించింది. కానీ అనూహ్యంగా పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తనూజ నామినేషన్లలో లేకపోవడం, ఆమె ఫ్యాన్స్ ఓట్లు కూడా కల్యాణ్ కు పడటమే కారణమని అంటున్నారు.
డేంజర్లో వీళ్లు
{{/usCountry}}సాధారణంగా అయితే ఇమ్మాన్యుయేల్ గేమ్ పరంగా, ఎంటర్ టైన్మెంట్ పరంగా అదరగొడుతున్నాడు. అతను కొన్ని వారాల తర్వాత నామినేషన్లలోకి వచ్చాడు. దీంతో ఓటింగ్ లో అతనే టాప్ లో ఉంటాడనిపించింది. కానీ అనూహ్యంగా పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తనూజ నామినేషన్లలో లేకపోవడం, ఆమె ఫ్యాన్స్ ఓట్లు కూడా కల్యాణ్ కు పడటమే కారణమని అంటున్నారు.
డేంజర్లో వీళ్లు
{{/usCountry}}పడాల కల్యాణ్ 34.37 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ 25.08 శాతం ఓటింగ్ తో రెండో స్థానంలో ఉన్నాడు. భరణి (15.47 శాతం), డీమాన్ పవన్ (10.45 శాతం) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. సంజన గల్రానీ, దివ్య నిఖిత డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన 8.09 ఓటింగ్ శాతంతో అయిదో ప్లేస్ లో, దివ్య నిఖిత 6.53 శాతం ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో ఉంది.