బిగ్ బాస్ 9 తెలుగులో కొత్త వారం వచ్చిందంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరగడం కామనే. కానీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ డిఫరెంట్ గా ఉంది. స్వయంగా బిగ్ బాస్ రంగంలోకి దిగి ఫోనోలో హౌస్ మేట్స్ తో ఆడుకుంటున్నాడు. మరోవైపు తనూజ మాటలను రీతు అస్సలు నమ్మదు. ఇక ఈ వారం ఓటింగ్ ఎలా ఉందో కూడా చూసేయండి.
బిగ్ బాస్ 9 టాస్క్

బిగ్ బాస్ 9 తెలుగులో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ నేరుగా రంగంలోకి దిగాడు. ఫోనోలో హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఆటాడిస్తున్నాడు. ఫస్ట్ ఫోన్ లో తనూజ మాట్లాడుతుంది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి అందరికీ చెప్పమని బిగ్ బాస్ చెప్తాడు. తనూజ అదే చెప్తుంది. కానీ రీతు ఆమె మాటలను నమ్మదు. సీక్రెట్ టాస్క్ అని డౌట్ పడ్తుంది. గౌరవ్ ఏమో కాల్ లిఫ్ట్ చేస్తే కంటెండర్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారని అంటాడు.
రీతుతో బిగ్ బాస్
బిగ్ బాస్ మళ్లీ కాల్ చేస్తే సంజన లిఫ్ట్ చేస్తుంది. కానీ ఫోన్ ను రీతుకు ఇవ్వమంటాడు బిగ్ బాస్. రీతు.. మీరు తనూజ మాటలను నమ్ముతున్నారా? అని అడుగుతాడు బిగ్ బాస్. లేదు.. అని రీతు చెప్తుంది. వెరీ గుడ్.. ఈ టాస్క్ నమ్మకంతోనే సాగుతుందని ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. టాస్క్ ఇప్పటికే మొదలైందని చెప్పమంటాడు.
బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్
బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం ఓటింగ్ చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనూజ మరోసారి టాప్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమెకు 33.81 శాతం ఓటింగ్ ఉంది. నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కల్యాణ్ పడాల 18.83 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సుమన్ శెట్టి 15.36 శాతం, భరణి 11 శాతం ఓటింగ్ తో వరుసగా మూడు, నాలుగు స్థానల్లో ఉన్నారు.
డేంజర్ లో శ్రీనివాస్
{{/usCountry}}బిగ్ బాస్ 9 తెలుగు తొమ్మిదో వారం ఓటింగ్ చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనూజ మరోసారి టాప్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమెకు 33.81 శాతం ఓటింగ్ ఉంది. నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కల్యాణ్ పడాల 18.83 శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సుమన్ శెట్టి 15.36 శాతం, భరణి 11 శాతం ఓటింగ్ తో వరుసగా మూడు, నాలుగు స్థానల్లో ఉన్నారు.
డేంజర్ లో శ్రీనివాస్
{{/usCountry}}బిగ్ బాస్ 9 తెలుగు 9వ వారం ఓటింగ్ లో ప్రస్తుతం శ్రీనివాస్ సాయి డేంజర్ జోన్లో ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శ్రీనివాస్ సాయి ఈ వారం ఓటింగ్ లో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. సంజన 9.58 శాతం, రాము రాథోడ్ 7.02 శాతం ఓటింగ్ తో అయిదారు ప్లేస్ ల్లో ఉన్నారు. శ్రీనివాస్ సాయి 4.39 శాతం ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.