...
...
Next Story

Bigg Boss OTT Winner: రేవ్ పార్టీలో పాము విషం- బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతపై క్రిమినల్ కేసు- సుప్రీంకోర్టు తీర్పు ఇదే!

Supreme Court Quashes Bigg Boss Winner Elvish Yadav FIR: యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్‌పై నమోదైన రేవ్ పార్టీ పాము విషం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. చట్టపరమైన నిబంధనలు సరిగా పాటించలేదనే కారణంతో క్రిమినల్ విచారణను రద్దు చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Mar 19, 2026, 15:08:09 IST
Advertisement

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్‌కు ఉన్నత న్యాయస్థానంలో పెద్ద ఊరట లభించింది. 2023లో నోయిడాలో జరిగిన ఒక రేవ్ పార్టీలో పాము విషాన్ని సరఫరా చేశారనే ఆరోపణలపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు గురువారం (మార్చి 19) కొట్టివేసింది. ఈ కేసులో చట్టపరమైన లోపాలు ఉన్నాయని, ప్రస్తుత రూపంలో ఎఫ్ఐఆర్ (FIR) నిలబడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కోర్టు పరిశీలించిన అంశాలు ఇవే..

రేవ్ పార్టీలో పాము విషం- బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతపై క్రిమినల్ కేసు- సుప్రీంకోర్టు తీర్పు ఇదే!
రేవ్ పార్టీలో పాము విషం- బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతపై క్రిమినల్ కేసు- సుప్రీంకోర్టు తీర్పు ఇదే!

జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ప్రధానంగా రెండు చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఒకటి ఎన్‌డీపీఎస్ (NDPS) యాక్ట్, రెండోది వన్యప్రాణి సంరక్షణ చట్టం.

ఎన్‌డీపీఎస్ చట్టంలో లేదు

"నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థం ఎన్‌డీపీఎస్ చట్టంలోని షెడ్యూల్ జాబితాలో లేదు. అంతేకాకుండా, ఎల్విష్ యాదవ్ దగ్గర నుంచి ఎటువంటి రికవరీ జరగలేదు. కేవలం తన అనుచరుడి ద్వారా ఆర్డర్ ఇచ్చారనే అభియోగాలు మాత్రమే ఉన్నాయి" అని ఎల్విష్ యాదవ్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

సెక్షన్ 55 ప్రకారం

అలాగే వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్ 55 ప్రకారం.. ఈ కేసులో విచారణ ప్రారంభించాలంటే వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన అధికారి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ఆ నిబంధన పాటించలేదని, అందుకే ఎఫ్ఐఆర్ చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, చట్ట ప్రకారం సరైన పద్ధతిలో కొత్తగా ఫిర్యాదు చేసేందుకు సంబంధిత అధికారులకు కోర్టు వెసులుబాటు కల్పించింది.

గతంలో కోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎల్విష్ యాదవ్ ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇలా నోరులేని జీవులైన పాములను వాడుకోవడం సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. మీరు జూకి వెళ్లి జంతువులతో ఆటలాడుకుంటామంటే కుదురుతుందా? అది నేరం కాదా?" అని గతంలో ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రస్తుతం ఎల్విష్ యాదవ్ ఏం చేస్తున్నారు?

ఇకపోతే హిందీ బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ 2023 జూన్ 17న ప్రారంభమై ఆగస్ట్ 14న ముగిసింది. 70 రోజులపాటు సాగిన ఈ బిగ్ బాస్ ఓటీటీ 2కి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. తన గేమ్, ఆటతో మెప్పించిన ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతగా నిలిచాడు. అలాగే, అభిషేక్ మల్హాన్ రన్నరప్ అయ్యాడు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe