టాలీవుడ్ హీరోగా సూపర్ క్రేజ్ సాధించిన శివాజీ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిగ్ బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు 7తో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించి వరుస సినిమా ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు. కోర్ట్ మూవీలో మంగపతిగా అలరించిన శివాజీ నటించిన లేటెస్ట్ మూవీ దండోరా.
సామాజిక అసమానతలపై

సామాజిక అసమానతలపై తెరకెక్కిన దండోరా సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. శివాజీతోపాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన దండోరా డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కానుంది.
శివాజీ కామెంట్స్
ఈ నేపథ్యంలో దండోరా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దండోరా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు శివాజీ.
‘కోర్ట్’ కంటే ముందే ‘దండోరా’ కథ విన్నారా?
-ముందుగా ‘దండోరా’ కథను విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కోర్ట్ కంటే ముందే ‘దండోరా’ మేకర్లు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ, ప్రొడక్షన్ పరంగా ఆలస్యమైంది. అలా ‘కోర్ట్’ ముందుగా రిలీజ్ అయింది.
‘దండోరా’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
-‘దండోరా’ చిత్రంలో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది.
-ఈ చిత్రంలో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను. అయితే ఈ చిత్రంలోని అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది.
‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం అనుకోవచ్చా?
-‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. ‘దండోరా’ మాత్రం అద్భుతమైన సినిమా. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎంతో సహజంగా ఉండే చిత్రమిది.
‘కోర్ట్’ తరువాత వస్తున్న ‘దండోరా’పై సహజంగానే అంచనాలు ఉంటాయి. మరి వాటికి తగ్గట్టుగానే మీ పాత్ర ఉంటుందా?
{{/usCountry}}-‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. ‘దండోరా’ మాత్రం అద్భుతమైన సినిమా. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎంతో సహజంగా ఉండే చిత్రమిది.
‘కోర్ట్’ తరువాత వస్తున్న ‘దండోరా’పై సహజంగానే అంచనాలు ఉంటాయి. మరి వాటికి తగ్గట్టుగానే మీ పాత్ర ఉంటుందా?
{{/usCountry}}-‘కోర్ట్’ మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ‘దండోరా’లోని పాత్రకి కూడా వస్తుంది. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. అద్భుతమైన కంటెంట్‌తో ఎమోషనల్‌గా సాగే చిత్రమిది.