Bigg Boss 10 Telugu: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ బిగ్ బాస్ 10వ తెలుగులో ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి. ఫస్ట్ వీక్ నుంచే ఈ సారి సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇక ఇప్పుడేమో వైల్డ్ కార్డు ఎంట్రీలతో మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
బిగ్ బాస్ 10 తెలుగులో వైల్డ్ కార్డు

బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు కామనే. ఆట బోర్ కొడుతుంది, ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు అనుకునే టైమ్ లో వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్లు వస్తుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగులోనూ వైల్డ్ కార్డులు రాబోతున్నారు. ఈ సారి రెండు సార్లు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు.
ఆ ముగ్గురు
ముందుగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టబోతున్నారని తెలిసింది. ఈ ముగ్గురు కూడా ఈ సీజన్ కు ముందు అగ్నిపరీక్షలో పార్టిసిపేట్ చేసినవాళ్లే అని సమాచారం. వాళ్లే.. నవరసాలు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ అని టాక్.
ఎంట్రీ ఎప్పుడంటే?
బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ మోస్ట్ లీ ఈ రోజు లేదా రేపు ఉండచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ వెళ్లారని తెలిసింది. ఫస్ట్ అయితే ఈ ముగ్గురు హౌస్ లోకి అడుగుపెట్టడం ఖాయం.
అదే ట్విస్ట్
రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత వీళ్లకు టాస్క్ లు, ఓటింగ్ పెడతారని తెలిసింది. మరి ఈ ముగ్గురిని కంటెస్టెంట్లుగా హౌస్ లోకి తీసుకుంటారా? లేదా వీళ్లలో ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి వైల్డ్ కార్డు ఎంట్రీలపై మాత్రం ఓ క్లారిటీ వచ్చిందనే చెప్పొచ్చు.
{{/usCountry}}రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత వీళ్లకు టాస్క్ లు, ఓటింగ్ పెడతారని తెలిసింది. మరి ఈ ముగ్గురిని కంటెస్టెంట్లుగా హౌస్ లోకి తీసుకుంటారా? లేదా వీళ్లలో ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి వైల్డ్ కార్డు ఎంట్రీలపై మాత్రం ఓ క్లారిటీ వచ్చిందనే చెప్పొచ్చు.
{{/usCountry}}ఇక హౌస్ లోకి అపూర్వ అడుగుపెడితే ఆట మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందనే కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే అగ్నిపరీక్షలో రోహిత్, అపూర్వ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక హౌస్ లోనేమో రోహిత్, శాలిని మధ్య బాండింగ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అపూర్వ వచ్చి రోహిత్ తో క్లోజ్ గా ఉంటే ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.