Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఇంట్రెస్టింగ్ ఘట్టం వచ్చేసింది. ఈ సీజన్ లోనే ఫస్ట్ నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. ఫస్ట్ వీక్ హౌస్ మేట్స్ కానందుకు కంటెస్టెంట్లందరినీ బిగ్ బాస్ డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. ఇప్పుడు సెకండ్ వీక్ లో నామినేషన్ ఫైర్ అంటుకుంది.
బిగ్ బాస్ నామినేషన్స్

బిగ్ బాస్ రియాలిటీ షోలో నామినేషన్స్ కు వేరే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోనూ ఈ నామినేషన్స్ పోరు షురూ అయింది. ఈ సీజన్ సెకండ్ వీక్ లో హౌస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న కంటెస్టెంట్లను నామినేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆ ఛాన్స్ దక్కాలంటే ఓ టాస్క్ కూడా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
టార్గెట్ త్రిగుణ్
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లేటెస్ట్ ప్రోమో చూస్తే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో త్రిగుణ్ ను ఇతర టీమ్ మేట్స్ టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే లేటెస్ట్ ప్రోమోలో ఎక్కువ మంది త్రిగుణ్ ను నామినేట్ చేయడం కనిపించింది.
సుధీర్ తో మొదలెట్టి
లేటెస్ట్ బిగ్ బాస్ 10 తెలుగు నామినేషన్స్ ప్రక్రియ యాంకర్ సుధీర్ తో మొదలైంది. అతను త్రిగుణ్ ను నామినేట్ చేశాడు. చైత్ర విషయంలో డిస్టర్బ్ అయిన కారణంతో త్రిగుణ్ ను సుధీర్ నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా త్రిగుణ్, సుధీర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ తర్వాత శాలినిని కూడా సుధీర్ నామినేట్ చేశాడు.
ఇదే షాకింగ్
నామినేషన్ ప్రక్రియలో దేబ్జానీ కూడా త్రిగుణ్ ను నామినేట్ చేసింది. అయితే ఇందులో త్రిగుణ్ పేరును రోహిత్ చెప్పడం షాకింగ్ అనే చెప్పొచ్చు. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచే రోహిత్ వర్సెస్ త్రిగుణ్ అన్నట్లు ఫైట్ సాగుతోంది.
{{/usCountry}}నామినేషన్ ప్రక్రియలో దేబ్జానీ కూడా త్రిగుణ్ ను నామినేట్ చేసింది. అయితే ఇందులో త్రిగుణ్ పేరును రోహిత్ చెప్పడం షాకింగ్ అనే చెప్పొచ్చు. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచే రోహిత్ వర్సెస్ త్రిగుణ్ అన్నట్లు ఫైట్ సాగుతోంది.
{{/usCountry}}అయితే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ముందు రోహిత్ కు త్రిగుణ్ సారీ చెప్పాడు. రోహిత్ కూడా త్రిగుణ్ ను హార్ట్ కు దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో గొడవ అంతా సర్దుమణిగిందనే అనిపించింది. కానీ రోహిత్ ఏమో త్రిగుణ్ ను నామినేట్ చేశాడు.
ఇక నామినేషన్ మధ్యలో సృష్టి పేరు వచ్చింది. త్రిగుణ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని సుధీర్, రోహిత్ ఫైర్ అయ్యారు. దీనికి త్రిగుణ్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు.