Bigg Boss 10 Double Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రేక్షకులను అనూహ్య మలుపులతో అలరిస్తోంది. ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ కు వచ్చేసరికి ఓటింగ్ లో భారీ మార్పులు కనిపించాయి. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని లీక్ వీరులు ముందే పసిగట్టారు. అయితే, ఆ ఇద్దరు కంటెస్టెంట్లు దక్షి, శాలిని కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వైల్డ్ కార్డు దక్షి.. రెండు వారాలకే ఔట్!

దక్షి బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హౌస్ లోకి ప్రారంభంలో రాలేదు. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాలతో వచ్చిన దక్షి కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్ లో కొనసాగింది. ఇతర కంటెస్టెంట్లతో ఇమిడిపోవడంలో ఆమె పూర్తిగా విఫలమైంది.
గేమ్ పరంగా కూడా తన మార్క్ చూపించలేకపోయింది. ఫిజికల్ టాస్కుల్లో డల్ గా ఉండటం, స్ట్రాటజీలు వర్కౌట్ కాకపోవడంతో ప్రేక్షకుల్లో ఆమెకు పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశం దక్కలేదు. ఫలితంగా ఓటింగ్ లో వెనుకబడి వైల్డ్ కార్డు జర్నీ కాస్తా రెండు వారాలకే ముగిసిపోయింది. ఇప్పటికే ఆమె ఎలిమినేషన్ కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది.
శాలిని-రోహిత్ లవ్ ట్రాక్
ఇక ఈ ఇవాళ (అక్టోబర్ 25) బిగ్ బాస్ నుంచి శాలిని కూడా ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. శాలిని జర్నీ బిగ్ బాస్ 10లో ఒక రోలర్ కోస్టర్ లా సాగింది. ముందుగా ఆమె ఎవిక్ట్ అయినట్లు అనిపించినా, బిగ్ బాస్ ఆమెను సీక్రెట్ రూమ్ కు పంపించాడు. అక్కడి నుంచి హౌస్ మేట్స్ గేమ్ ను గమనించి మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, రీ ఎంట్రీ తర్వాత శాలిని గేమ్ కంటే కూడా.. రోహిత్ తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ నెట్టింట తీవ్ర స్థాయిలో వైరల్ అయింది.
వీరిద్దరి రొమాంటిక్ కెమిస్ట్రీకి యూత్ బాగానే కనెక్ట్ అయినప్పటికీ, శాలిని వ్యక్తిగత ఆటతీరు మాత్రం మసకబారింది. కేవలం లవ్ ట్రాక్ పైనే ఫోకస్ పెట్టి, టాస్కులను పక్కన పెట్టేసిందనే విమర్శలు వచ్చాయి. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినా తన సొంత ఆటను మెరుగుపరుచుకోకపోవడం వల్లే ఈ వారం ఆమెకు ఓట్లు ఆశించిన స్థాయిలో పడలేదు.
వామ్మో.. రెమ్యునరేషన్!
{{/usCountry}}వీరిద్దరి రొమాంటిక్ కెమిస్ట్రీకి యూత్ బాగానే కనెక్ట్ అయినప్పటికీ, శాలిని వ్యక్తిగత ఆటతీరు మాత్రం మసకబారింది. కేవలం లవ్ ట్రాక్ పైనే ఫోకస్ పెట్టి, టాస్కులను పక్కన పెట్టేసిందనే విమర్శలు వచ్చాయి. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినా తన సొంత ఆటను మెరుగుపరుచుకోకపోవడం వల్లే ఈ వారం ఆమెకు ఓట్లు ఆశించిన స్థాయిలో పడలేదు.
వామ్మో.. రెమ్యునరేషన్!
{{/usCountry}}ఆటతీరు ఎలా ఉన్నా కూడా దక్షి, శాలిని తీసుకున్న రెమ్యునరేషన్ లెక్కలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చి కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్న దక్షికి.. వారానికి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షలు ముట్టినట్లు సమాచారం.
ఇక ఏడు వారాల పాటు హౌస్ లో సందడి చేసి, సీక్రెట్ రూమ్ అనుభూతి కూడా పొందిన శాలినికి వారానికి రూ.75 వేల చొప్పున అగ్రిమెంట్ కుదిరిందట. అంటే ఏడు వారాలకు గాను ఆమెకు రూ. 5.25 లక్షల రెమ్యునరేషన్ దక్కినట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.