...
...
Next Story

Bigg Boss Telugu 10: ఇదెక్కడి ట్విస్ట్ మావ-బిగ్ బాస్ ఓటింగ్ లో రోహిత్ ను దాటేసిన టెంపర్ వంశీ-డేంజర్ జోన్లో టాప్ ప్లేయర్!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఎనిమిదో వారం ఓటింగ్ ట్రెండ్స్ ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడూ టాప్‌లో ఉండే రోహిత్‌కు టెంపర్ వంశీ గట్టి పోటీ ఇస్తూ ఓటింగ్‌లో దూసుకుపోతున్నాడు. టాప్ కంటెస్టెంట్లలో ఒకరు ఈ వారం డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు. ఎలిమినేషన్ కు దగ్గరగా నిలిచారు.

Published on: Oct 29, 2026, 11:39:44 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం ఊహించని విధంగా దక్షి, షాలిని డబుల్ ఎలిమినేషన్ కావడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సరికొత్తగా సాగింది. గోట్ (GOAT) లెవల్‌లో ఉన్న కంటెస్టెంట్లకు జడ్జీల బాధ్యతలు అప్పగించడంతో నామినేషన్స్ రసవత్తరంగా మారాయి.

టెంపర్ వంశీ దూకుడు

ఇదెక్కడి ట్విస్ట్ మావ-బిగ్ బాస్ ఓటింగ్ లో రోహిత్ ను దాటేసిన టెంపర్ వంశీ-డేంజర్ జోన్లో టాప్ ప్లేయర్!
ఇదెక్కడి ట్విస్ట్ మావ-బిగ్ బాస్ ఓటింగ్ లో రోహిత్ ను దాటేసిన టెంపర్ వంశీ-డేంజర్ జోన్లో టాప్ ప్లేయర్!

ఈ బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో మొదటి నుంచి రోహిత్ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఓటింగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. అయితే, ఎనిమిదో వారం నామినేషన్స్‌లో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎప్పుడూ టాప్ ప్లేస్‌లో ఉండే రోహిత్‌ను దాటేసి టెంపర్ వంశీ అనూహ్యంగా దూసుకుపోతున్నాడు.

త్రిగుణ్ మాస్టర్ మైండ్

టెంపర్ వంశీకి ఓటింగ్ పెరగడం వెనుక బిగ్ బాస్ ఇంట్లోని మాస్టర్ మైండ్ త్రిగుణ్ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రీన్ లెవల్‌లో ఉండి ఈ వారం నామినేషన్స్ నుంచి త్రిగుణ్ సేఫ్ అయ్యాడు. అతను నామినేషన్స్‌లో లేకపోవడంతో త్రిగుణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు వంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో వంశీ ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి, ఏకంగా రోహిత్‌ను బీట్ చేసే స్థాయికి చేరుకుంది.

డేంజర్ జోన్‌లో వర్షిణి

బిగ్ బాస్ హౌస్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వర్షిణికి ఈ వారం గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, వర్షిణి కేవలం 5 శాతం ఓట్లతో అత్యంత వెనుకబడి చివరి స్థానంలో ఉంది. ముకేష్ ఓట్లు వర్షిణికి బదిలీ అవుతాయని అందరూ భావించినప్పటికీ, అలా జరగలేదు.

ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ బట్టి చూస్తే రోహిత్, వంశీ ఇద్దరూ భారీ ఓట్లతో సేఫ్ జోన్‌లో ఉన్నారు. సుధీర్, రాంప్రసాద్, రామకృష్ణ లాంటి వారు ఓ మోస్తరు ఓట్లతో తమ స్థానాలను పదిలం చేసుకుంటున్నారు. కానీ, వర్షిణి పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది.

తక్కువ ఓటింగ్ శాతం కారణంగా ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు, సోషల్ మీడియా వర్గాలు భావిస్తున్నాయి. అప్పటికప్పుడు బిగ్ బాస్ ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప, ఎనిమిదో వారం వర్షిణి ఎలిమినేషన్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks