బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఎనిమిదో వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడు లేని డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో రంజుగా సాగుతోంది. బిగ్ బాస్‌లో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కంటెస్టెంట్స్ శ్రీజ దమ్ము, భరణి శంకర్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
పర్మనెంట్‌గా భరణి శంకర్

వీరిలో భరణి శంకర పర్మనెంట్ హౌజ్‌మేట్‌గా కన్ఫర్మ్ అయ్యారు. ఓ టాస్క్ ద్వారా భరణిని బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్‌గా రీ ఎంట్రీ ద్వారా చేశారు. అలాగే, ఈ వారం బిగ్ బాస్‌లో నామినేషన్స్ ప్రక్రియను ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నిర్వహించారు. కత్తులతో పొడిచే టాస్క్‌తో బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారం నామినేషన్స్ జరిగాయి.
బిగ్ బాస్ నామినేషన్స్‌లో 8 మంది
ఎనిమిదో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో మొత్తంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో తనూజ గౌడ, కల్యాణ్ పడాల, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్, రాము రాథోడ్, సంజన గల్రానీ, దివ్వెల మాధురి ఉన్నారు. వీరిందరికి నామినేషన్స్ అనంతరం ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి.
ఓటింగ్ తారుమారు
అయితే, బిగ్ బాస్ ఓటింగ్‌లో ఎప్పుడు సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి టాప్ 1లో నిలిచేది. కానీ, ఈసారి బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు అయి తనూజ గౌడ రెండో ప్లేస్‌లోకి పడిపోయింది. 25.6 శాతం ఓటింగ్, 17,576 ఓట్లతో కల్యాణ్ పడాల టాప్ 1 స్థానంలో కల్యాణ్ పడాల దూసుకుపోతున్నాడు.
ఎవరికెంత ఓటింగ్
అతని తర్వాత రెండో ప్లేసులో తనూజ గౌడ 20.8 శాతం ఓటింగ్, 14,281 ఓట్లతో ఉంది. ఇక మూడో స్థానంలో సంజన గల్రానికి 17.19 శాతం ఓటింగ్ (11,807 ఓట్లు), రీతు చౌదరి 15.33 శాతం ఓటింగ్ (10,527 ఓట్లు)తో నాలుగో ప్లేసులో, 15.33 శాతం ఓటింగ్ (3,809 ఓట్లు)తో ఐదో స్థానంలో రాము రాథోడ్ ఉన్నాడు.
ఎలిమినేషన్‌కు దగ్గరిగా
{{/usCountry}}అతని తర్వాత రెండో ప్లేసులో తనూజ గౌడ 20.8 శాతం ఓటింగ్, 14,281 ఓట్లతో ఉంది. ఇక మూడో స్థానంలో సంజన గల్రానికి 17.19 శాతం ఓటింగ్ (11,807 ఓట్లు), రీతు చౌదరి 15.33 శాతం ఓటింగ్ (10,527 ఓట్లు)తో నాలుగో ప్లేసులో, 15.33 శాతం ఓటింగ్ (3,809 ఓట్లు)తో ఐదో స్థానంలో రాము రాథోడ్ ఉన్నాడు.
ఎలిమినేషన్‌కు దగ్గరిగా
{{/usCountry}}ఇక 5.24 శాతం ఓటింగ్ (3,601 ఓట్లు)తో ఆరో ప్లేసులో దివ్వెల మాధురి, 5.15 శాతం ఓటింగ్ (3,538 ఓట్లు)తో డీమాన్ పవన్ ఏడో స్థానంలో ఉన్నారు. ఇక చిట్ట చివరి స్థానమైన 8 ప్లేసులో అందరికంటే తక్కువగా 5.14 శాతం ఓటింగ్ (3,527 ఓట్లు)తో గౌరవ్ గుప్తా ఉన్నాడు. అంటే ఎలిమినేషన్‌కు దగ్గరిగా గౌరవ్ గుప్తా ఉన్నాడు.
చివరి రెండు స్థానాల్లో
చివరి రెండు ప్లేసుల్లో ఉన్నవారు సాధారణంగా డేంజర్ జోన్‌లో ఉంటారు. ఈ ఓటింగ్ లెక్కల ప్రకారం డీమాన్ పవన్, గౌరవ్ చివరి రెండు స్థానాలతో డేంజర్ జోన్‌లో నిలిచారు.
ఓటింగ్ మారితే
కానీ, వీరిలో అందరికంటే తక్కువ ఓట్లు ఉన్న గౌరవ్ ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్‌లో మార్పుతో ఎలిమినేషన్ నుంచి బయటపడే ఛాన్స్ కూడా ఉంది.