ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు సత్తాచాటుతున్నాయి. ఒక్కో ఓటీటీలో ఒక్కో బ్లాక్ బస్టర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రొమాంటిక్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలా వేర్వేరు జోనర్లలోని సినిమాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాలు ఏవి? వీటిని మీరు చూశారా? అని చెక్ చేసుకోండి.
తేరే ఇష్క్ మే ఓటీటీ

తమిళ స్టార్ హీరో ధనుష్ హిందీలో చేసిన మరో మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో అమర కావ్యం పేరుతో రిలీజైంది ఈ చిత్రం. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ మోసం చేసిందని తెలుసుకున్నాక హీరో ఎలా మారాడు? అనేది తేరే ఇష్క్ మే లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
సిరై
ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో తమిళ సూపర్ హిట్ మూవీ సిరై కూడా ఉంది. ఇది క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో హెడ్ కానిస్టేబుల్ కదిరవన్ నిజాయితీగా ఉంటాడు. ఓ హత్య కేసులో నిందితుణ్ని జైలు నుంచి కోర్టుకు అతను తీసుకెళ్తాడు. కానీ ఆ నిందితుడు నిర్దోషి అని తెలిసినప్పుడు ఆ కానిస్టేబుల్ ఏం చేశాడన్నది ఉత్కంఠ కలిగిస్తుంది. విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా జీ5 ఓటీటీలో ఉంది.
మార్క్
కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ మార్క్ జియోహాట్ స్టార్ లో సత్తాచాటుతోంది. ఇందులో కిచ్చా సుదీప్ తో పాటు నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. ఈ కన్నడ సినిమా ఓటీటీలో తెలుగులోనూ ఉంది. సస్పెండ్ అయినప్పటికీ డ్రగ్స్ నెట్ వర్క్, 20 మంది చిన్నపిల్లల కిడ్నాప్ ను ఛేదించే పోలీస్ కథ ఇది.
చీకటిలో
ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసిన మరో సినిమా ‘చీకటిలో’. శోభితా ధూళిపాళ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇందులో హీరోయిన్ ఓ పాడ్ కాస్ట్ నిర్వహిస్తుంది. చీకటిలో వచ్చి అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్ గురించి చెప్తుంటుంది. మరి ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు? అన్నది చీకటిలో సినిమాలో చూడాల్సిందే.
శంబాల ఓటీటీ
{{/usCountry}}ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసిన మరో సినిమా ‘చీకటిలో’. శోభితా ధూళిపాళ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇందులో హీరోయిన్ ఓ పాడ్ కాస్ట్ నిర్వహిస్తుంది. చీకటిలో వచ్చి అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్ గురించి చెప్తుంటుంది. మరి ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు? అన్నది చీకటిలో సినిమాలో చూడాల్సిందే.
శంబాల ఓటీటీ
{{/usCountry}}ఈ వారం తెలుగు ఆడియన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన ఓటీటీ రిలీజ్ మూవీ ‘శంబాల’. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రిజల్ట్ సాధించింది. ఆకాశంలో నుంచి ఓ ఉల్క శంబాల అనే గ్రామంలో పడుతుంది. ఆ తర్వాత అక్కడ వింత సంఘటనలు, హత్యలు జరుగుతాయి. దెయ్యం అని జనాలు భయపడతారు. మరి అప్పుడు జియాలజిస్ట్ అయిన హీరో ఏం చేశాడు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.