...
...
Next Story

Hrithik Roshan: హాలీవుడ్ దర్శక నిర్మాతలతో చేతులు కలిపిన హృతిక్ రోషన్- జాదూ వర్సెస్ రాకీ అంటూ!

Hrithik Roshan For Hail Mary: క్రిష్ 4 సినిమాతో బిజీగా ఉన్న బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హాలీవుడ్ దర్శకులతో చేతులు కలిపారు. సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ప్రమోషన్స్ కోసం హృతిక్ రోషన్ జాదూ వర్సెస్ రాకీ అంటూ స్పెషల్ వీడియో పంచుకున్నారు.

Published on: Mar 22, 2026, 12:00:47 IST
Advertisement

బాలీవుడ్ గ్రీక్ గాడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హాలీవుడ్ దర్శక నిర్మాతలతో చేతులు కలిపారు. అందుకు కారణం హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ మేకర్స్‌తో హృతిక్ రోషన్ జట్టు కట్టారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ రోషన్ ఒక క్రేజీ క్రాసోవర్ వీడియోతో ముందుకు వచ్చారు.

జాదూ వర్సెస్ రాకీ

హాలీవుడ్ దర్శక నిర్మాతలతో చేతులు కలిపిన హృతిక్ రోషన్- జాదూ వర్సెస్ రాకీ అంటూ!
హాలీవుడ్ దర్శక నిర్మాతలతో చేతులు కలిపిన హృతిక్ రోషన్- జాదూ వర్సెస్ రాకీ అంటూ!

"జాదూ వర్సెస్ రాకీ" అంటూ ఒక ప్రత్యేక వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్‌ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ర్యాన్ గ్లోసింగ్ మూవీ

హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, 'ది మార్షియన్' ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. డిసెంబర్ 2025లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం.

సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి

హృతిక్ రోషన్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రల పోషించారు.

4 భాషల్లో మార్చి 26న విడుదల

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ భాషల్లో వార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, హృతిక్ రోషన్ ప్రస్తుతం క్రిష్ 4 సినిమాతో బిజీగా ఉన్నాడు. భారతీయ వెండితెరపై మొట్టమొదటి విజయవంతమైన సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’.

క్రిష్ 4 మూవీ

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ‘క్రిష్ 4’ పనులు ఇప్పుడు వేగవంతమయ్యాయి. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్టుపై సీరియస్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ 4 స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2026 ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe