Bhumi Pednekar Prays Lord Shiva Wearing Sunglasses: బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. శ్రావణ మాసం ప్రారంభం కావడం వల్ల శివాలయానికి వెళ్లిన ఆమె, నల్ల కళ్లజోడు (సన్ గ్లాసెస్) ధరించి శివలింగానికి నీటితో అభిషేకం చేశారు.
భూమి పెడ్నేకర్ వీడియో వైరల్

ఈ వీడియో చూసిన నెటిజన్లు భూమి పెడ్నేకర్ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన భూమి, కళ్లకు బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న భూమి ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనే
"శ్రావణ మాసం ప్రారంభమైన వేళ, నా జీవితం సులువుగా మారిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నా. హర్ హర్ మహాదేవ్" అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు హీరోయిన్ భూమి పెడ్నేకర్.
భక్తి పేరిట ఫొటోషూటా?
ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే నెటిజన్లు భూమి పెడ్నేకర్‌ను ఆడేసుకుంటున్నారు. గుడిలోకి వెళ్లేటప్పుడు, దేవుడికి పూజ చేసేటప్పుడు కనీసం సన్ గ్లాసెస్ తీసే సంస్కారం లేదా అని ప్రశ్నిస్తున్నారు. "దేవుడి ముందు భక్తి శ్రద్ధలు చూపుతున్నారా లేక ప్రమోషనల్ ఫొటోషూట్ చేసుకుంటున్నారా?" అని ఒక నెటిజన్ నిలదీశారు.
వరద బాధితులకు సాయం కోరిన భూమి
"గుడిలో కూడా కళ్లజోడు పెట్టుకుని పూజలు చేసే వారిని నేనెప్పుడూ చూడలేదు" అని మరొకరు కామెంట్ చేశారు. అయితే, ఈ విమర్శలపై భూమి ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ఇటీవల అస్సాంలో సంభవించిన తీవ్ర వరదలపై భూమి పెడ్నేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి అందరూ ముందుకురావాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు.
సీఎం నుంచి అభినందనలు
"ప్రస్తుతం అస్సాం తీవ్ర సంక్షోభంలో ఉంది. వేలాది కుటుంబాలు నివాసాలు కోల్పోయాయి. వారికి ఆహారం, వైద్య సదుపాయాలు తక్షణమే అందాలి. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో విరాళాలు ఇవ్వాలి" అని భూమి విజ్ఞప్తి చేశారు. ఆమె చొరవను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కార్యాలయం కూడా అభినందించింది.
వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు
{{/usCountry}}"ప్రస్తుతం అస్సాం తీవ్ర సంక్షోభంలో ఉంది. వేలాది కుటుంబాలు నివాసాలు కోల్పోయాయి. వారికి ఆహారం, వైద్య సదుపాయాలు తక్షణమే అందాలి. ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో విరాళాలు ఇవ్వాలి" అని భూమి విజ్ఞప్తి చేశారు. ఆమె చొరవను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కార్యాలయం కూడా అభినందించింది.
వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు
{{/usCountry}}'దమ్ లగా కే హైషా' చిత్రంతో ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన భూమి, మొదటి సినిమా నుంచే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 'దల్‌దల్' సిరీస్‌లో భూమి యాక్ట్ చేసింది.
ట్రోలర్ల బారిన భూమి పెడ్నేకర్
ఈ ఓటీటీ సిరీస్ లో డీసీపీ రీటా ఫెర్రేరియాగా సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో భూమి పెడ్నేకర్ కనిపించి వీక్షకులను ఆకట్టుకున్నారు. సామాజిక అంశాలపై నిత్యం స్పందించే ఈ భామ, గుడిలో కళ్లజోడు వ్యవహారంలో మాత్రం ట్రోలర్ల బారిన పడటం గమనార్హం.