Priyanka Chopra: సర్జరీ చేయించుకోమని సలహా ఇస్తే వికటించింది- ముఖం మారింది, అవకాశాలు పోయాయి: ప్రియాంక చోప్రాపై నిర్మాత
Suneel Darshan On Priyanka Chopra Surgery Fail: ప్రియాంక చోప్రా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ప్రియాంక చోప్రా ముక్కు సర్జరీ వికటించడంతో ముఖం మారిపోయి, వరస అవకాశాలు పోగొట్టుకుని నటి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాన్ని ప్రముఖ నిర్మాత గుర్తుచేసుకున్నారు.
Suneel Darshan On Priyanka Chopra Surgery Fail: గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నేడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ స్టార్లతో కలిసి గ్లోబల్ వేదికలు పంచుకోవడమే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

తీవ్ర పోరాటం
అయితే, ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న కొత్తలో ప్రియాంక చోప్రా చిత్రసీమలో తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఒక సర్జరీ వికటించి ప్రియాంక చోప్రా ముఖం పూర్తిగా మారిపోవడం, ఆ కారణంగా అవకాశాలు చేజారడం నటి జీవితంలో పెను సవాలుగా మారింది.
సర్జరీ సలహా ఇచ్చింది ఆ నిర్మాతే!
2003లో అక్షయ్ కుమార్, లారా దత్తాతో కలిసి నటించిన 'అందాజ్' చిత్రంతో ప్రియాంక బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా నిర్మాత సునీల్ దర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆనాటి పరిణామాలను పంచుకున్నారు. అందాజ్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రియాంకకు ముక్కు సర్జరీ గురించి తాను సలహా ఇచ్చానని తెలిపారు.
"అందాజ్ సినిమా ప్రారంభించే ముందు ప్రియాంక ముక్కు దూలం సరిచేసుకోవాలని చెప్పాను. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రసిద్ధ వైద్యులు కావడంతో వెంటనే శస్త్రచికిత్స చేయించారు" అని సునీల్ దర్శన్ గుర్తుచేసుకున్నారు. సాధారణంగా సౌందర్యం కోసం చేసే ప్లాస్టిక్ సర్జరీలు చాలా ప్రమాదకరమని, ప్రతి చిన్న లోపాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
డిప్రెషన్.. ముంబై వదిలేసి వెళ్దామనుకుని!
ప్రియాంక ఈ సర్జరీని కేవలం అందం పెంచుకోవడానికి మాత్రమే చేయించుకోలేదు. ముక్కులో పాలిప్ (Polyp) అనే సమస్య రావడంతో దాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోగా, వైద్యుల పొరపాటు వల్ల ఆమె రూపురేఖలు మారిపోయాయి. ఈ చేదు అనుభవాన్ని ప్రియాంక గతంలో 'ది హోవార్డ్ స్టెర్న్ షో'లో వెల్లడించారు.
"సర్జరీ సమయంలో డాక్టర్లు పొరపాటు చేశారు. దాంతో నా ముఖం పూర్తిగా మారిపోయింది. ఆ సమయంలో నేను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను" అని ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. రూపురేఖలు మారడంతో వరుసగా సినిమాలు చేజారిపోయాయి. చాలామంది నిర్మాతలు ఆమెను ప్రాజెక్టుల నుంచి తొలగించారు.
ధైర్యాన్నిచ్చిన అనిల్ శర్మ.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తీరు
తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక, ముంబై నగరాన్ని వదిలేసి తన సొంత ఊరైన బరేలీకి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై' చిత్ర దర్శకుడు అనిల్ శర్మ ప్రియాంకకు అండగా నిలిచారు. సినిమా వదిలేసి బరేలీకి వెళ్లిపోతానని, అడ్వాన్స్ డబ్బులు వెనక్కి తీసుకోమని ప్రియాంక అడిగినప్పటికీ ఆయన అంగీకరించలేదు.
ఆమెకు ధైర్యం చెప్పి, ఒక ప్రతిభావంతుడైన మేకప్ ఆర్టిస్ట్‌ను పరిచయం చేసి ముఖంలో వచ్చిన మార్పులను కవర్ చేసేలా తోడ్పాటునందించారు. "చిన్న చిన్న విషయాలకు కంగారు పడొద్దు. మనం సరిదిద్దలేని సమస్య అంటూ ఏదీ ఉండదు" అని ప్రియాంక తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా కూడా ఆమెలో ధైర్యం నింపారట.
తిరుగులేని హీరోయిన్‌గా
ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా అవతరించడమే కాకుండా, హాలీవుడ్‌లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నేడు అంతర్జాతీయ స్టార్‌గా రాణిస్తున్నారు ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబు కాంబో ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో ప్రియాంక హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


