Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లి కావ్య జీవితాన్ని పుస్తకంలో చదివిన ఇందు పడుకుండిపోతుంది. కావ్య పిలుస్తుంది. తన తల్లిని చూసి ఇందు మురిసిపోతుంది. రేఖ వల్ల కష్టాల్లో ఉన్నట్లు చెబుతుంది ఇందు. ఆస్తి కోసం తాతయ్య వాళ్లను చంపేస్తానంది అంతేగా, నువ్వు నా కూతురువి, నువ్వు అనుకుంది సాధిస్తావని మోటివేట్ చేస్తుంది కావ్య.
సంతకం పెడితే ఓడిపోయినట్లు కాదు

నేను నీలా ఉండలేను అమ్మా. సంతకం పెట్టాలనుకుంటున్నా అని ఇందు ఏడుస్తుంది. నేను మాత్రం అన్ని యుద్ధాలు గెలిచానా. నువ్వు సంతకం పెడితే ఓడిపోయినట్లు కాదు. ఏదో ఒక రోజు నీకు టైమ్ వస్తుంది. ఈ ప్రకృతి నిన్ను గెలిపిస్తుంది. అది జరగాలంటే నిన్ను నువ్వు నమ్మాలి. అప్పుడు నువ్వు అనుకుంది సాధిస్తావ్. కాస్తా జాగ్రత్తగా ఆలోచించు అని ధైర్యం నింపిన తల్లి కావ్య మాయమైపోతుంది.
నా భయాన్ని దూరం చేయడానికి వచ్చావా అమ్మా. సరే అమ్మ నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. యుద్ధంలో గెలిచేవరకు పోరాడుతాను, సమయం వచ్చేవరకు ఎదురుచూస్తాను. కానీ, రేఖను మాత్రం గెలవనివ్వను అని ఇందు అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం పడుకున్న ఇందు దగ్గరికి వచ్చిన రేఖ, భ్రమరాంబ, భూషణ్ హ్యాపీ బర్త్ డే అని గట్టిగా అరిచి చెబుతారు. దాంతో కంగారుగా లేచిన ఇందు దొంగ దొంగ అని అరుస్తుంది.
మేము ఇందు అని సర్దిచెబుతుంది రేఖ. మీ పిన్ని మొహం దగ్గరగా చూసేసరికి దొంగలా అనిపించి భయబడ్డావా అని శేషు సెటైర్లు వేస్తాడు. భ్రమరాంబ కోప్పడుతుంది. తర్వాత అంతా ఇందుకు హ్యాపీ బర్త్ డే అని చెబుతారు. ఎందుకీ దొంగ ప్రేమలు, దేనికోసం, నువ్వేంటో నాకు తెలియదా అని అపర్ణ అంటుంది. మా నానమ్మ గురించి తెలిసిందేగా. మీరిచ్చిన డ్రెస్ వేసుకోవాలి అంతేగా నేను మీరు చెప్పినట్లు రెడీ అవుతాను అని ఇందు అంటుంది.
నేను మాయమైపోతాను
నువ్వు రెడీ అయి వచ్చేసరికి లేట్ అవుతుంది. మేము వెళ్లి ఫామ్ హౌజ్‌లో ఏర్పాట్లు చేస్తాం. స్వాతి ఇందును తీసుకుని రా. ఆంటీ నువ్వు మాతోరా అని రేఖ చెప్పి వెళ్లిపోతుంది. దాని నక్క తెలివితేటలకి ప్రేమకు పడిపోకు, అసలు ఆ బర్త్ డే పార్టీకే రాకు అని ఇందుతో అంటుంది అపర్ణ. నేను నిర్ణయం తీసుకున్నా అని ఇందు అంటుంది. ఇంతలో అపర్ణను రేఖ పిలుస్తుంది. సరే ఏదైనా చేయి కానీ ఆ ఆస్తిని దాని చేతిలో పెట్టకని అపర్ణ వెళ్లిపోతుంది.
{{/usCountry}}నువ్వు రెడీ అయి వచ్చేసరికి లేట్ అవుతుంది. మేము వెళ్లి ఫామ్ హౌజ్‌లో ఏర్పాట్లు చేస్తాం. స్వాతి ఇందును తీసుకుని రా. ఆంటీ నువ్వు మాతోరా అని రేఖ చెప్పి వెళ్లిపోతుంది. దాని నక్క తెలివితేటలకి ప్రేమకు పడిపోకు, అసలు ఆ బర్త్ డే పార్టీకే రాకు అని ఇందుతో అంటుంది అపర్ణ. నేను నిర్ణయం తీసుకున్నా అని ఇందు అంటుంది. ఇంతలో అపర్ణను రేఖ పిలుస్తుంది. సరే ఏదైనా చేయి కానీ ఆ ఆస్తిని దాని చేతిలో పెట్టకని అపర్ణ వెళ్లిపోతుంది.
{{/usCountry}}ఏం చేయాలనుకుంటున్నావ్ అని ఇందును స్వాతి అడుగుతుంది. నేను పార్టీకి వస్తాను. కానీ, సంతకం పెట్టట్లేదు. కేక్ కట్ చేశాక మాయమైపోతాను. ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేస్తారుగా. నన్ను నేను కిడ్నాప్ చేసుకుంటాను. అందరిముందు కిడ్నాప్ చేస్తే తాతయ్య, నానమ్మను ఏం చేయకుండా నాకోసం వెతుకుతుందని ఇందు అంటుంది. ఐడియా బాగుంది, కానీ, కిడ్నాప్ ఎవరు చేస్తారని స్వాతి అడుగుతుంది.
నువ్వే అని ఇందు అంటే.. నాకు కిడ్నాప్ చేసేవాళ్లు తెలియదు అని స్వాతి అంటుంది. దాంతో ఇందు బతిమిలాడుతుంది. నాకు ఇద్దరు తెలుసు, వారితో చేయిస్తాను అని స్వాతి అని కిడ్నాప్ చేసేందుకు వెళ్లి మాట్లాడతానంటుంది. మరోవైపు ఫామ్ హౌజ్‌కి రాజ్, లక్కీ వస్తారు. ఇలా వచ్చారేంటీ, కిడ్నాప్ అయ్యాక మీరు కనిపించకుంటే డౌట్ వస్తుంది. మీరు నా ఫ్రెండ్స్ అని తెలుసు కాబట్టి అంతా దొరికిపోతామని ఐశ్వర్య కోప్పడుతుంది.
వెయిటర్స్‌గా రాజ్, లక్కీ
ఐషు చెప్పింది నిజమే. మనం గెటప్‌లో రావాల్సింది అని లక్కీ అంటాడు. పక్కన వెయిటర్స్ మరో ఇద్దరి కోసం ఎదురుచూస్తున్నట్లు ఫోన్‌లో మాట్లాడుతారు. అది విన్న రాజ్ అదే మన గెటప్ అంటాడు. వారి దగ్గరికి వెళ్లి రాజ్ తనే మ్యానేజర్ సత్యం అని పరిచయం చేసుకుంటాడు. అలా వెయిటర్స్ గెటప్‌లో రాజ్, లక్కీ ఇందును కిడ్నాప్ చేసేందుకు రెడీ అవుతారు. మరోవైపు రేఖకు అప్పిచ్చినవాళ్లంతా పలకరిస్తారు.
అప్పు ఈసారైనా తీరుస్తారా అని సెటైర్లు వేస్తారు. పేరుకే బర్త్ డే పార్టీ అంతా అప్పులు ఇచ్చినవాళ్లే ఉన్నారు అని శేషు అంటాడు. నిజమే, ఇన్ని రోజులు మనం అప్పులు తిరిగి ఇవ్వకపోవడం వల్ల వాళ్లంతా కలిసి త్వరలోనే మనమీద యుద్థం ప్రకటిద్దామని అనుకుంటున్నారు. వారు అలా దాడి చేయకుండా ఉండాలంటే నా మీద నమ్మకం రావాలి. వాళ్ల కళ్ల ముందు నా పేరు మీదున్న ఆస్తి పేపర్స్ మీద ఆ ఇందు సంతకం పెడితే అందరూ నమ్ముతారు అని రేఖ అంటుంది.
ఇంతలో చక్రి వచ్చి తన డబ్బు గురించి అడుగుతాడు. త్వరలోనే నేను స్వరాజ్ గ్రూప్‌కు చైర్మన్ కాబోతున్నా. అప్పుడు మనం చేసే బిజినెస్ ముందు మీ కోట్ల అప్పు చాలా చిన్నగా అనిపిస్తుందని రేఖ అంటుంది. అది చూస్తాను అని బెదిరించి పోతాడు చక్రి. అప్పులోళ్లందరూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇందు సంతకం పెట్టడంలో తేడా రాదుగా అని భూషణ్ భయంగా అడుగుతాడు. అన్ని అనుకున్నట్లుగా జరుగుతాయని రేఖ అంటుంది.
అపర్ణను చూసిన నందు
అక్కడే తేడా కొడుతుందమ్మా. మనం అనుకొన్నవి జరగవుగా అని శేషు అంటాడు. అపశకునాలు మాట్లాడకుండా పని చూద్దామని రేఖ అంటుంది. మరోవైపు వెయిటర్స్‌గా రాజ్, లక్కీ ఉంటారు. మొహాలు గుర్తు పట్టకుండా ఉండేందుకు మాస్క్ పెట్టుకుంటారు. ఇంతలో ఇందు అందంగా రెడీ అయి వస్తుంది. ఇందు అందం చూసి రాజ్ ఫిదా అయిపోతాడు.
అందాల రాక్షసిరా అని ఇందును అంటాడు రాజ్. ఇందు బర్త్ డే పార్టీకి వచ్చిన నందు అపర్ణ చూసి గుర్తు పడుతుంది. నానమ్మా అని పిలుస్తుంది. ఇందును చూసి తను తన సొంత అక్క అని అనుకుంటుంది నందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.