...
...
Next Story

Brahmamudi August 31 Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి వెళ్లిపోయిన మదన్- పగతో రగిలిపోయిన రేఖ- ఐశ్వర్యకు లాస్ట్ వార్నింగ్

Brahmamudi Serial August 31st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ ఎపిసోడ్‌‌లో డీఎన్ఏ రిపోర్ట్ చూపించడంతో లక్కీ తన కొడుకే అని రేఖ ఒప్పుకుంటుంది. దారుణంగా మోసం చేసిందని భూషణ్‌తో భ్రమరాంబ అంటుంది. ఇంట్లోంచి మదన్ వెళ్లిపోతాడు. రేఖ పగతో రగిలిపోతుంటుంది. తానేంటో చూపిస్తానని, రాజు అంతు చూస్తానంటుంది.

Published on: Aug 31, 2026, 08:20:21 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీని పసిగుడ్డుగా ఉన్నప్పుడు విసిరేసిన మహాతల్లి ఎవరో కాదు రేఖ పిన్నీనే అని రాజు చెబుతాడు. లక్కీ మీ అమ్మ రేఖ పిన్నీయేరా అని రాజు అంటాడు. అంతా అబద్ధం అని మదన్ అంటే.. రేయ్ మీ అమ్మ రెండు తప్పులు చేసింది. ఒకటి లక్కీని కనడం, రెండోది అనాథను చేయడమని రాజు అంటాడు.

రేఖ కొడుకు కాబట్టే ఇంట్లో పెట్టావా

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ ఎపిసోడ్

ఇన్ని రోజులు రేఖ పిన్ని చెబుతుందని చూశాను. చెప్పకపోయేసరికి నేనే చెప్పాను అని రాజు అంటాడు. రేఖ కొడుకు కాబట్టే లక్కీని ఈ ఇంట్లో పెట్టావా అల్లుడు అని శేషు అంటే.. అవును అని రాజు అంటాడు. లేదు అబద్ధం, నీ పెళ్లి గురించి నిజాన్ని తప్పించేందుకు ఇదంతా చేస్తున్నావని భూషణ్, భ్రమరాంబ అంటారు. దాంతో డీఎన్ఏ రిపోర్ట్స్ అందరికి చూపిస్తాడు రాజు.

రేఖను మదన్ అడుగుతాడు. రిపోర్ట్స్ ఏంటీ లక్కీ నీ కొడుకు అని చెబుతున్నాయేంటని మదన్ అడుగుతాడు. భ్రమరాంబ కూడా అడుగుతుంది. డీఎన్ఏ రిపోర్ట్స్ చూపించిన తర్వాత కూడా నమ్మట్లేదా అని అపర్ణ అంటుంది. వాళ్లు రేఖ పిన్ని చెబితేనే నమ్ముతారని రాజు అంటాడు. మదన్, భ్రమరాంబ, భూషణ్ అదేపనిగా అడగడంతో లక్కీ నా కొడుకే. డీఎన్ఏ రిపోర్ట్స్ నిజమే, రాజు చెప్పేది నిజమే అని రేఖ ఒప్పుకుంటుంది.

నా పెళ్లి జోలికి వస్తే ఊరుకోను

రేఖ పిన్ని ఒప్పుకుందిగా. ఇప్పుడు మీ కోపాలు తాపాలు ఏమైనా ఉంటే మీ రేఖపై చూపించుకోండి. ఇంకోసారి మా పెళ్లి విషయంలో ఎవరైనా తలదూరిస్తే నేను ఊరుకోను.. ఐషు నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అని రాజు వెళ్లిపోతాడు. రేఖను ఎమోషనల్‌గా చూస్తాడు లక్కీ. మదన్ అవమానంతో తలదించుకుంటాడు. తర్వాత రేఖ చేసినదానికి లబోదిబో అంటుంది భ్రమరాంబ.

నీ పెళ్లాం మనల్ని చాలా దారుణంగా మోసం చేసింది. బిడ్డ ఉన్నాకూడా నిన్ను పెళ్లి చేసుకుంది. మనందరిని ముఖ్యంగా నిన్ను వెర్రోన్ని చేసింది. దానికి తగిన బుద్ధి చెప్పాలి. ఏం చేయాలో చెప్పు. నీ జీవితం, నీ కొడుకు జీవితాన్ని నాశనం చేసిందని భ్రమరాంబ రెచ్చగొడుతుంది. భూషణ్ మాత్రం సైలెంట్‌గా వెళ్లిపోతాడు. పెళ్లాం ఇచ్చిన షాక్‌కి వాడి ఫీజులు పోయినట్లున్నాయని శేషు అంటాడు.

రేఖ దగ్గరికి లక్కీ వెళ్తాడు. అమ్మా అని పిలుస్తాడు. ఇన్నిరోజులు నా తల్లి నువ్వే అని తెలియకా నేను పడేంత బాధ నీకే చెప్పుకున్నాగా. నేను ఎవరో నీకు తెలిసి కూడా నీ మనసు కరగలేదా. అసలు నన్నెందుకు కన్నావ్. నేను ఏం తప్పు చేశానని నన్ను విసిరేశావ్. నేనంటే నీకెందుకు అంత కోపం. నేను కడుపులో పుట్టడమేనా నేను చేసిన తప్పా. నాకు ఎన్ని అవమానాలు జరిగాయో తెలుసా అని లక్కీ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఒక్కసారి అమ్మ స్పర్శ చూడొచ్చా

ఇప్పుడు నాకు నా తల్లి ఎవరో తెలిసింది. కేరాఫ్ ప్లాట్‌ఫామ్ కాదని తెలిసింది. అమ్మ గురించి ఎంతో గొప్పగా విన్నాను. ఒక్కసారి నిన్ను ముట్టుకోవచ్చా. అమ్మ స్పర్శ ఎలా ఉంటుందో చూడాలని ఉందని రేఖ చేయి పట్టుకుంటాడు లక్కీ. రేఖ కన్నీళ్లు పెట్టుకుంటుంది. లక్కీ చేయి తీసేస్తుంది. ఇదంతా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

నువ్వు ఈ కొడుకు అక్కర్లేదనుకుంటున్నావుగా. నీ కొడుకుగా నువ్వు ఒప్పుకునేవరకు నేను ఎదురుచూస్తాను అని లక్కీ వెళ్లిపోతాడు. మరోవైపు ఏంటీ రాజు ఇలా చేశావ్. మా ఆంటీ తన నోటితోనే చెప్పాలన్నావ్. అందరు ఇప్పుడు రేఖ ఆంటీని తప్పుబడతారుగా అని ఇందు అంటుంది. ఏం చేయమంటావ్. ఇది బయటకు రాకుండా నన్ను చంపాలనుకుంది. ఎన్నో అవకాశాలు ఇచ్చాను. అన్నింటికి మించి ఇవాళ లక్కీని అంతా తప్పుబడుతుంటే నోరు జారాను. సారీ అని రాజు అంటాడు.

ఇంట్లోంచి వెళ్లిపోయిన మదన్

నువ్వు తప్పు చేశావని అనట్లేదని ఇందు అంటుంది. లక్కీ పడిన బాధలు, రేఖ తప్పులు చెబుతాడు రాజు. మనమీద పగ పెంచుకుని ఏమైనా చేస్తుందేమో అని ఇందు అంటే.. తనని మనం మోసం చేయలేదు. నీకు, నీ ఫ్యామిలికి రేఖ పిన్ని నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చిన నేను కాపాడుతాను. నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే కాపాడుకుంటాను అని రాజు అంటాడు.

తర్వాత స్వాతి పరిగెత్తుకుంటూ వచ్చి మదన్ బావ ఇంట్లోంచి వెళ్లిపోతున్నాడని రేఖకు చెబుతుంది. లగేజ్ సర్దుకుని మదన్ వెళ్లిపోతుంటాడు. రేఖ ఆపుతుంది. ఇక్కడ ఉండలేను. నిన్ను ఎంత నమ్మాను. నువ్వు మోసం చేశావ్. వాడికోసం నన్ను కొట్టావుగా మమ్మీ. అప్పటికీ వాడి తల్లిని నువ్వు వెతకాల్సిన అవసరం ఏంటని అని మదన్ అంటాడు.

పగతో రగిలిపోయిన రేఖ

రేఖ ఎంత చెప్పిన మదన్ వినకుండా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. గేట్ ముందే రేఖ కూలబడిపోయి ఏడుస్తుంటుంది. రేఖ చీకటి కోణం ఇవాళే బయటపడింది. రేఖ కోపంతో రగిలిపోతుంటుంది అని అపర్ణతో సుభాష్ అంటాడు. ఈ రేఖ అంటే ఏంటో అందరికి చూపిస్తాను. నన్ను ఇంతలా టార్చర్ పెట్టిన రాజును అస్సలు వదిలిపెట్టను అని రేఖ రగిలిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe